రెండు బస్సులు ఢీ

0
1


రెండు బస్సులు ఢీ

17 మందికి గాయాలు

ప్రమాదానికి కారణమైన బాన్సువాడ డిపో బస్సు

కన్నారెడ్డి(నాగిరెడ్డిపేట), న్యూస్‌టుడే : నాగిరెడ్డిపేట మండలంలోని కన్నారెడ్డి మూలమలుపు వద్ద బోధన్‌-హైదరాబాద్‌ రహదారిపై గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 17 మంది క్షతగాత్రులను 108 వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బోధన్‌ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తోంది. దీని వెనుక బాన్సువాడ డిపోనకు చెందిన బస్సు ఎల్లారెడ్డి నుంచి మెదక్‌కు వెళుతోంది. కన్నారెడ్డి గ్రామ మూల మలుపు వద్దకు రాగానే ఎదురుగా లారీ రావడంతో బస్సు డ్రైవర్‌ హఠాత్తుగా బ్రేకు వేశారు. వెనుకనే వస్తున్న బస్సు వేగంగా ముందున్న బస్సును ఢీ కొన్నట్లు చెప్పారు. దీంతో బస్సు వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్‌ రమేష్‌, కండక్టర్‌ విజయ, మల్లయ్యపల్లికి చెందిన పోచవ్వ, రాకేష్‌, నిజాంసాగర్‌ మండలం గాలిపూర్‌కు చెందిన గంగారాం, సుశీల, ధరావత్‌ సంగ్యా (కొయ్యగుట్టతండా), గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లికి చెందిన విఠల్‌, సాయవ్వ, లక్ష్మి, సాయిలు, సురేష్‌( మాటూర్‌), మహ్మద్‌ మోహీన్‌ (ఎల్లారెడ్డి), మెహరున్నీసా బేగం(ఎల్లారెడ్డి), పంతుల గాలమ్మ (కోడిపాల, మెదక్‌ జిల్లా), సాలె పోచమ్మ(గోపాల్‌పేట), నర్సమ్మ(ఎల్లారెడ్డి), లింగవ్వ(చిన్నఆత్మకూర్‌), బత్తుల దుర్గవ్వ(సబ్ధల్‌పూర్‌) గాయపడ్డారు.. ఘటన స్థలాన్ని ఎస్సై మోహన్‌ సందర్శించి. ప్రమాద కారణాలను ఆరా తీశారు.

క్షతగాత్రులను 108లో ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది

https://betagallery.eenadu.net/htmlfiles/128679.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here