రెండేళ్లలో భారత్ పరిస్థితి ఇదీ: ఆ దెబ్బతో $2 ట్రిలియన్లకు దిగజారింది

0
1


రెండేళ్లలో భారత్ పరిస్థితి ఇదీ: ఆ దెబ్బతో $2 ట్రిలియన్లకు దిగజారింది

ముంబై: గత ఆరు నెలల కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 ట్రిలియన్ డాలర్ల మార్క్ దిగువకు పడిపోయింది. గత శుక్రవారం ఒక్క రోజునే లిస్టెడ్ స్టాక్స్ మొత్తం వ్యాల్యూ 1.97 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. ఇటీవల బడ్జెట్‌లో సూపర్ రిచ్ పైన అధిక పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను (FPI) వెనక్కి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో కూడా వెనక్కి తీసుకుంటున్నారు.

జూన్ 4న రికార్డ్ మార్కెట్ వ్యాల్యూ

2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన దేశాల క్లబ్‌లో భారత్ ఎనిమిదో దేశంగా మే 2017లో చేరింది. భారతీయ జనతా పార్టీ రెండోసారి అద్భుత మెజార్టీతో అధికారంలోకి వచ్చాక అనారోగ్య మార్కెట్‌కు ముగింపు పలికేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో జూన్ 4వ తేదీన మార్కెట్ వ్యాల్యూ 2.24 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్.

పడిపోయిన ఇండియా మార్కెట్ వ్యాల్యూ

పడిపోయిన ఇండియా మార్కెట్ వ్యాల్యూ

గత ఏడాది డిసెంబర్ నెలలో జర్మనీని అధిగమించిన ఇండియా, ఏడో అతిపెద్ద స్టాక్ మార్కెట్ దేశంగా నిలిచింది. అయితే ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్ (FPI)లు వెనక్కి వెళ్లిపోవడంతో తిరిగి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. జూలై 5వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పలు కంపెనీలు నష్టాల్లో కనిపిస్తున్నాయి. ఎస్పీఐ, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు వంటి పలు బ్యాంకుల క్యాపిటలైజేషన్ తగ్గింది.

పన్నెండేళ్ల క్రితం 1 ట్రిలియన్ డాలర్లు

పన్నెండేళ్ల క్రితం 1 ట్రిలియన్ డాలర్లు

అదే సమయంలో కెనడా, జర్మనీ దేశాలు వరుసగా 19 శాతం, 4 శాతం లాభపడ్డాయి. ఇవి ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ క్యాప్ దేశాల్లో ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2017 నవంబర్ నెలలో భారత్.. కెనడాను అధిగమించి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. మే 28, 2007 నాటికి భారతదేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

భారత్, సౌత్ కొరియా మాత్రమే..

భారత్, సౌత్ కొరియా మాత్రమే..

ఈ ఏడాదిలో అధిక మార్కెట్ వ్యాల్యు కలిగిన టాప్ 15 దేశాల్లో.. భారత్, సౌత్ కొరియా మాత్రమే నష్టపోయాయి. చైనా మార్కెట్ క్యాప్ 22 శాతం పెరిగి 6.58 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా 19.2 శాతం పెరిగి 32.037 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here