రెండో టీ20లో విజయం.. సిరీస్‌ భారత్‌దే

0
1


లాడర్‌హిల్‌: ప్రపంచకప్‌ అనంతరం ఆడిన తొలి సిరీస్‌లో భారత్‌ విజయవంతమైంది. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీకి తోడు బౌలర్లు సమష్టి ప్రదర్శన చేయడంతో కరీబియన్లపై టీమిండియా పైచేయి సాధించింది. ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో వెస్టిండీస్‌ 15.3 ఓవర్లలో 98/4 ఉన్న దశలో వర్షం మ్యాచ్‌కు బ్రేక్‌ వేసింది.

పృథ్వీషాకు కఠిన శిక్ష వేశారు.. తక్కువ శిక్షతో సరిపెట్టాల్సింది

ఆరంభంలోనే షాక్:

ఆరంభంలోనే షాక్:

లక్ష్య చేధనలో విండీస్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసక ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ (0) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (12 బంతుల్లో 4) పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన విండీస్.. ఆ తర్వాత జాగ్రత్తగా ఆడింది.

 పావెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌:

పావెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌:

మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన రోమన్‌ పావెల్‌ (54; 34 బంతుల్లో 6×4, 3×6).. నికొలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 19; 1 ఫోర్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. మూడో వికెట్‌కుఈ జోడీ 76 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన పావెల్‌ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 41 బంతుల్లో 84 పరుగులు అవసరమైన స్థితిలో స్పిన్నర్ కృనాల్‌ పాండ్యా వీరిద్దరినీ ఔట్‌ చేసి మ్యాచ్ మలుపుతిప్పాడు.

పిడుగులు పడుతుండటంతో:

పిడుగులు పడుతుండటంతో:

అయితే పొలార్డ్‌ (8), హెట్‌మైర్‌ (6)లు ఆదుకునేందుకు ప్రయతించారు. విండీస్ స్కోర్ 16వ ఓవర్లో 98/4తో ఉన్న దశలో మైదాన సమీపంలో పిడుగులు పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆపేశారు. తర్వాత వర్షం కూడా మొదలైంది. భారీ వర్షం పడడంతో మ్యాచ్ కొనసాగడానికి వీలుకాలేదు. డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం టీమిండియా 22 పరుగుల తేడాతో నెగ్గింది. డ/లూ పద్ధతిలో విండీస్ స్కోర్ 120 పరుగులు ఉంటే గెలిచేది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌కు దక్కింది.

మరోసారి సాండ్‌ పేపర్‌ సెగ: వార్నర్‌ రిప్లై.. ఇంగ్లాండ్‌ అభిమానులు షాక్‌!!

రోహిత్‌ అర్ధ సెంచరీ:

రోహిత్‌ అర్ధ సెంచరీ:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో థామస్‌ (2/27), కాట్రెల్‌ (2/25) రెండేసి వికెట్లు తీశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here