‘రెండో టెస్టులో వార్నర్ చెలరేగుతాడు.. కళ్లలో ఆ కసి కనిపించింది’

0
3


లండన్: యాషెస్ రెండో టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్ అందుకుని చెలరేగుతాడు అని ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ధీమా వ్యక్తం చేసారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూకుకెళ్లింది. ఇక లార్డ్స్‌ వేదికగా బుధవారం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కోచ్ లాంగర్‌ మీడియాతో మాట్లాడారు.

రగ్బీ జట్టు కోసం ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు ఏంచేశారంటే!!

జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ… ‘వార్నర్ గొప్ప ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వార్నర్ మొదటి టెస్టులో పరుగులు చేయలేదు. అత్యుత్తమ ఆటగాళ్లు విఫలమైతే నాకు ఇష్టం. ఎందుకంటే.. తర్వాతి మ్యాచ్‌ల్లో అలాంటి బ్యాట్స్‌మన్‌ చెలరేగుతాడు. రెండో టెస్టులో కచ్చితంగా ఫామ్ అందుకుని చెలరేగుతాడు. అతడు పరుగులు చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. వార్నర్‌ కళ్లలో ఆ కసి కనిపించింది’ అని లాంగర్‌ తెలిపాడు. వార్నర్ మొదటి టెస్టులో కేవలం 10 పరుగులు మాత్రమే చేసాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. పురాగమనంలో స్మిత్ సత్తా చాటగా.. వార్నర్ విఫలమయ్యాడు.

రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్‌ బౌలర్ల భరతం పడతాం, జోఫ్రా ఆర్చర్‌ జట్టులోకి వచ్చినా ధీటుగానే బదులిస్తామని అంతకుముందు లాంగర్‌ హెచ్చరించాడు. లాంగర్ వ్యాఖ్యలను తాను తాను పెద్దగా పట్టించుకోనని ఆర్చర్ పేర్కొన్నాడు. తన టెస్టు అరంగేట్రంపై ఆర్చర్‌ మాట్లాడుతూ… ‘నేను వైట్‌బాల్‌ క్రికెట్‌ కంటే కూడా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఎక్కువ ఆడా. దాంతో టెస్టు ఫార్మాట్‌ భయం లేదు. నేను రెడ్‌బాల్‌ ఎక్కువ ఆడాననే విషయం అభిమానులకు తెలియకపోవచ్చు. నేను ససెక్స్‌తో క్రికెట్‌ను ఆరంభించినప్పుడు ఆడింది రెడ్‌బాల్‌ క్రికెటే. మానసికంగా బలంగా లేనప్పుడు అసలు మనం ఎవరనే ప్రశ్న తలెత్తుంది. నేను టెస్టు ఫార్మాట్‌లో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ఆర్చర్ తెలిపాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here