రెట్ట తెచ్చిన తంట.. రాళ్ల మధ్య ఇరుక్కుని 4 రోజులు నరకయాతన!

0
0


బ్బిలం రెట్టలను సేకరించేందుకు అడవిలోకెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు రెండు రాళ్ల మధ్యపడి ఇరుక్కున్నాడు. అందులో నుంచి బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పైగా చుట్టుపక్కల జనసంచారం కూడా లేకపోవడంతో నాలుగు రోజులు నీళ్లు, ఆహారం లేకుండా నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన కంబోడియాలో చోటుచేసుకుంది.

‘ఫ్రెష్ న్యూస్’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బత్తం‌బాగ్‌కు చెందిన సమ్ బోరా(28) గబ్బిలం రెట్టలను సేకరించేందుకు అడవికెళ్లాడు. రాళ్ల గుట్టలపై నడుస్తూ రెండు బండరాళ్ల మధ్యలోకి జారిపోయాడు. అతడి శరీరం వాటి మధ్య ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. బోరా ఇంటికి చేరకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఇల్లంతా జల్లెడపట్టారు. నాలుగు రోజులైనా బోరా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం బోరా సోదరుడు మరోసారి అడవిలో గాలించాడు. బండరాళ్ల మధ్యలో ఇరుక్కున్న బొరాను చూశాడు. అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Read also: డేంజర్ డాగ్స్.. కుక్క నాకడంతో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న మహిళ!

దీంతో పోలీసులు 200 మంది రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుమారు 6 గంటలు శ్రమించి.. రెండు బండ రాళ్లను పగలగొట్టి బొరాను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు రోజులుగా ఆహారం లేకపోవడంతో బోరా నీరసించిపోయాడని, అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కంబోడియాలో గబ్బిలాల రెట్లను ఎరువులుగా ఉపయోగిస్తారు. దీంతో అక్కడి పేదలు, రైతులు రెట్లను సేకరించి మార్కెట్లో విక్రయిస్తుంటారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here