రెడ్ డ్రెస్సులో రెచ్చిపోతున్న ‘రకుల్’.. నెటిజెన్స్ ఫిదా

0
3


రకుల్ ప్రీత్ సింగ్ చాలా తక్కువకాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ అక్కడ ఎక్కువరోజులు నిలవలేకపోయింది. ఒక పక్క ఫ్లాపులు పలకరించడం మరొకపక్క నిలకడలేకుండా బాలీవుడ్, కోలీవుడ్ అని తిరగడంతో తెలుగులో చాలామంది కొత్త హీరోయిన్స్ వచ్చి ఆ ప్లేస్‌ని భర్తీ చేసారు. దాంతో ఇప్పుడు కేవలం సీనియర్ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ దక్కుతున్నాయి. అయినా కూడా అలుపెరగకుండా ఒక హిట్ అయినా పలకరించకపోతుందా అనే ఆశతో వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం హిందీలో మార్జావాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే తమిళ్‌లో శివ కార్తికేయన్ సినిమా, భారతీయుడులో కూడా సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది.

Also Read: హిట్ కోసం తెలుగులోకి సూర్య?.. త్వరలో స్ట్రెయిట్ సినిమా

అయితే సినిమాల పరంగా బిజీగానే ఉన్నా కూడా మధ్య మధ్యలో మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వాళ్లకు కనువిందు చెయ్యడానికి మొహమాటపడదు. అవసరమయితే దానికి ప్రత్యేకంగా టైమ్ కూడా కేటాయిస్తుంది. రీసెంట్‌గా జరిగిన వోగ్ అవార్డ్స్ కోసం ఒక రెడ్ కలర్ గౌన్‌తో రెడీ అయ్యింది రకుల్. ఆ ఈవెంట్‌లో ఒక పక్క ధగ ధగమనే రెడ్ డ్రెస్సు అందాలు, మళ్ళీ మధ్యలో తొంగి చూస్తునట్టు ఆకర్షించే ఎద అందాలతో ఆ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రకుల్ ప్రీత్. ఉండడానికి ఆ గౌన్ పొడవుగానే ఉన్నప్పటికీ కూడా ఆమె పొడవాటి కాళ్ళను మిగతా వాళ్ళ కళ్ళకు కనబడకుండా దాస్తే తప్పు అన్నట్టు బయటపెట్టేసింది.

Also Read: ‘సైరా’ ట్రైలర్ 2: గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు

సినిమాల్లో హీరోలతో కలిసి ఏ మాత్రం మొహమాటపడకుండా కెమిస్ట్రీ పండించే రకుల్ ఒక రేంజ్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆమె అలా మత్తుగా చూస్తుంటే మన్మథ బాణాలు వదిలినట్టు ఉంది. అందుకే ఆ పోస్టులకు ఒక రేంజ్‌లో లైక్స్ వస్తున్నాయి. ఆ ఫొటోల్లో రకుల్‌ని వర్ణించడానికి చాలామందికి మాటలు కూడా కరువయ్యాయి. అందుకే కేవలం ఫైర్ అనే ఎమోజిలతో వాళ్ళ ఫీలింగ్స్ తెలిపారు.

Also Read: నీ థియేటర్‌లో మళ్ళీ నా బొమ్మ అంటున్న ఛార్మి

నిజంగా ఆ ఎర్రరంగు బట్టలకు ఆమె మేని ఛాయకు కూడా కలర్ కాంబినేషన్ అంతే హాట్‌గా ఉంది మరి. ఈమధ్య మరీ బక్కగా తయారయింది అని కామెంట్స్ ఎక్కువగా వినిపించడంతో బోడీ షేప్ మీద కూడా దృష్టి పెట్టినట్టుంది. అందుకే వావ్ అనిపించేస్తుంది. ఇప్పుడు మాత్రం రకుల్‌కి ఒక్క హిట్ పడినా మళ్ళీ దూసుకుని టాప్ ప్లేస్ కి వెళ్ళిపోతా అన్నట్టు సంకేతాలిస్తుంది. ఏది ఏమైనా రెడ్ డ్రెస్‌లో మాత్రం కుర్రాళ్ళగుండెల్ని నిర్దాక్షిణ్యంగా రఫ్ఫాడించేస్తుంది రకుల్.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here