రెపో అనుసంధానిత గృహ రుణం గురించి తెలుసా?

0
1


రెపో అనుసంధానిత గృహ రుణం గురించి తెలుసా?

గృహ రుణం తీసుకునే వారి కోసం ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్ బీ ఐ ) ఇటీవలే రెపో రేటు అనుసంధానిత గృహ రుణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటిదాకా ఈ బ్యాంకు ఇస్తున్న గృహరుణాలు నిధుల వ్యయ ఆధారిత రుణ వడ్డీరేటు (ఎం సి ఎల్ ఆర్) తో అనుసంధానమై ఉన్నాయి. జులై ఒకటో తేదీ నుంచి ఎం సి ఎల్ ఆర్ అనుసంధానిత గృహరుణం తో పాటు రెపో రేటు అనుసంధానిత గృహ రుణాన్ని ఎంచుకునే సదుపాయం అందుపాటులోకి వచ్చింది. ఫ్లోటింగ్ రేటు గృహ రుణం కావాలనుకునే వారు వీటిలో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ఎలా ఉంటుందంటే..

* రెపో రేటు గృహ రుణాన్ని ఎంచుకుంటే భారత రిజర్వు బ్యాంకు తన పరపతి విధాన సమీక్షలో రెపో రేటును మార్చగానే రుణంపై వడ్డీరేటు మారుతుంది.

* రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకులు తెచ్చుకునే రుణంపై రెపో రేటును విధిస్తుంటారు. ఇది తగ్గితే బ్యాంకులకు తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది. కాబట్టి తాము ఇచ్చే రుణంపై వడ్డీ రేటును తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల రుణం తీసుకున్న వారిపై భారం తగ్గుతుంది.

* అయితే ఇది నేరుగా రెపో రేటుతో అనుసంధానమై ఉండదు. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్ ) రేపో రేటు కన్నా 2.65 శాతం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రెపో రేటు 5.75 శాతం ఉంటే ఆర్ఎల్ఎల్ఆర్ 8.40 శాతం ఉండటానికి అవకాశం ఉంటుంది.

గృహ రుణం

గృహ రుణం

* ప్రస్తుతం ఎస్ బీ ఐ నిధుల వ్యయ ఆధారిత రుణ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది.

* రూ. 75 లక్షల వరకు గృహ రుణం పై వడ్డీ రేటు 8.40-8.55 శాతం వరకు ఉంటుంది. ప్రస్తుతం ఎం సి ఎల్ ఆర్ లింక్డ్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 9.10 శాతం వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వడ్డీ రేటు బ్యాంకు అనుసరించే నిభందనలు, వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.

* రుణం తీసుకున్న వారు వార్షికంగా రుణంలో 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు వడ్డీ కూడా చెల్లించాలి. ఉదాహరణకు రూ. 20 లక్షల రుణం తీసుకుని ఉంటే అందులో 3 శాతం అంటే రూ.60,000 ప్రతి సంవత్సరం చెల్లించాలి. వడ్డీ కూడా చెల్లించాలి. బ్యాంకును సంప్రదిస్తే నెలవారీ వాయిదాల్లో ఈ సొమ్మును ఏ విధంగా చెల్లించాలి, మార్పులు ఏవిధంగా ఉంటాయో తెలుస్తుంది.

* క్రెడిట్ స్కోర్ బాగుంటే రెపో రేటుతో అనుసంధానమైన గృహ రుణ వడ్డీ రేటు చవకగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే బ్యాంకు ఇటీవలే ఈ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టినందువల్ల దీనిపై పూర్తిగా అవగాహనా రావడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు.

ఇవీ అర్హతలు...

ఇవీ అర్హతలు…

* ఆర్ఎల్ఎల్ఆర్ గృహ రుణం తీసుకోవాలంటే స్థూల వార్షిక ఆదాయం రూ. 6 లక్షలు ఉండాలి.

* మొత్తం రుణ కాలపరిమితి 35 ఏళ్ళ లోపు ఉంటుంది.

* లోన్ టు వాల్యూ 80 శాతం కన్నా ఎక్కువగా ఉంటే బ్యాంకు 0.20 శాతం ఎక్కువ ప్రీమియంను ఛార్జ్ చేస్తుంది.

* ప్రాపర్టీ, ఉద్యోగం, వ్యక్తిగత గుర్తింపునకు సంభందించిన పత్రాలు, బ్యాంకు కోరే ఇతర పత్రాలు, వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

* ఈ రుణానికి సంబంధించిన పూర్తి వివరాలు, అవసరమైన డాక్యుమెంట్ల గురించి తెలుసుకోవడానికి బ్యాంకు శాఖను సంప్రదిస్తే సరిపోతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here