రెపో రేటును 25 బేసిస్ పాయింట్స్ తగ్గించిన ఆర్బీఐ

0
0


రెపో రేటును 25 బేసిస్ పాయింట్స్ తగ్గించిన ఆర్బీఐ

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.75 శాతం నుంచి 5.40 శాతానికి వచ్చింది. రివర్స్ రెపో రేటును 5.15 శాతానికి సవరించింది. జీడీపీ వృద్ధి రేటును 7 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది.

ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు (0.35 శాతం) తగ్గించడంతో 5.4 శాతానికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఒక బేసిక్ పాయింట్ తగ్గినట్లు. రెపో రేటు తగ్గించడం వల్ల మార్కెట్లకు కొత్త ఊపు వస్తుంది. అలాగే బ్యాంకులు తమ తమ రుణ రేట్లను సవరించుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలి.

ఈ కేలండర్ ఇయర్ (2019) ప్రారంభం నుంచి ఇప్పటికే ఆర్బీఐ మూడుసార్లు వడ్డీ రేటును తగ్గించింది. దీంతో 6.50 శాతంగా ఉన్న వడ్డీ రేటు 5.75కు తగ్గింది. మూడు పర్యాయాలు పావు శాతం చొప్పున తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2019-20) ఇది మూడో ద్వైమాసిక పరపతి సమీక్ష. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) సోమవారం నుంచి భేటీలు ప్రారంభించింది.

బుధవారం వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్లు కూడా ఆశలు పెట్టుకున్నాయి. ఈ కారణంగానే గత కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు మంగళవారం లభాల్లోకి వచ్చాయి. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని మార్కెట్లు, ఆర్థిక నిపుణులు భావించారు. బుధవారం ఉదయం మార్కెట్లు స్వల్పనష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. ఆర్బీఐ పరపతి సమీక్ష ప్రకటనకు ముందు మాత్రం మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here