రెవెన్యూ ఉద్యోగుల నిరసన

0
2


రెవెన్యూ ఉద్యోగుల నిరసన

ఎల్లారెడ్డిలో నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

ఎల్లారెడ్డి, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తహసీల్దార్‌ మహిపాల్‌ అన్నారు. విధులు బహిష్కరించి ఎల్లారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్యోగభద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సదాశివనగర్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌ సంఘటనకు నిరసనగా సదాశివనగర్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. విజయ మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్‌, ఎంపీవో సతీష్‌కుమార్‌, ఉద్యోగులు సూర్యాజీరావు, శ్రీధర్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధారి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయను సజీవ దహనం చేసిన సంఘటనను నిరసిస్తూ గాంధారి రెవెన్యూ కార్యాలయం సిబ్బంది విధులను బహిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లత, డీటీ సంగమేశ్వర్‌, ఆర్‌ఐ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here