రేటింగ్ ఔట్‌లుక్ స్థాయి తగ్గింపు, భారత్‌కు మూడీస్ షాక్: నష్టాల్లో మార్కెట్లు

0
2


రేటింగ్ ఔట్‌లుక్ స్థాయి తగ్గింపు, భారత్‌కు మూడీస్ షాక్: నష్టాల్లో మార్కెట్లు

ముంబై: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (మూడీస్) భారత రేటింగ్ ఔట్ లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకు స్టేబుల్‌గా ఉన్న ఆర్థిక వ్యవస్థను నెగిటివ్‌కు మార్చింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆర్థిక, సంస్థాగత బలహీనతలను పరిష్కరించడంలో మూడీస్ అంచనా వేసినదాని కంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని సంస్థ అభిప్రాయపడింది. ఇలాగే ఉంటే అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్నన ఒడిదుడుకులను, తగ్గిన ఉపాది కల్పన, వివిధ రంగాల్లో నెలకొన్ని సంక్షోభాలు అధిగమించేలా ప్రభుత్వం చర్యలు ఉండాలని పేర్కొంది. పెట్టుబడులు పెంచేలా, వృద్ధిని పరుగులు పెట్టించేలా సంస్కరణలు అవసరమని పేర్కొంది.

మూడీస్ రేటింగ్ నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజులుగా జీవితకాల గరిష్టాలు నమోదు చేసిన స్టాక్స్ శుక్రవారం నెమ్మదించాయి. గం.9.30 సమయానికి సెన్సెక్స్ 0.3 శాతం నష్టపోయింది. నిఫ్టీ 0.35 శాతం నష్టపోయింది. గం.9.58 సమయానికి సెన్సెక్స్ 73 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయింది. గం.11.39 నిమిషాలకు సెన్సెక్స్ 131.51 (0.32%) పాయింట్లు కోల్పోయి 40,522.23కు, నిఫ్టీ 43.70 (0.36%) పాయింట్లు నష్టపోయి 11,968.35 వద్ద ట్రేడ్ అయింది. ఆర్థిక మందగమనాన్ని పరిష్కరించే ప్రభుత్వ చర్యల్లో స్తబ్ధత నెలకొన్న కారణంగానే రేటింగ్‌ తగ్గించినట్లు మూడీస్ పేర్కొంది.

డాలరుతో రూపాయి మారకం విలువ 70.68 వద్ద ట్రేడ్ అయింది. మూడీస్ రేటింగ్ నేపథ్యంలో గురువారం 71.25 వద్ద క్లోజైన రూపాయి శక్రవారం నష్టపోయింది. మూడీస్ రేటింగ్‌కు తోడు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వల్ల కూడా మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లడానికి కారణం. యస్ బ్యాంకు, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

మెరుగ్గా ఉన్నామని కేంద్రం ప్రకటన

మూడీస్ రేటింగ్ పై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్భణం అదుపులో ఉందని, స్వల్ప, మధ్యకాలిక వృద్ధికి భారత్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంతర్జాతీయంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ ఎన్నో చర్యలు చేపట్టిందని, దీంతో భారత్‌కు పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొంది. భారత వృద్ధి రేటు ఈ ఏడాది 6.1 శఆతానికి, 2020లో 7 శాతానికి పెరగవచ్చునని IMPF నివేదిక తెలిపింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here