రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక వర్గంలోని పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సుధాకర్‌ రావ్‌, పిట్లం మార్కెట్‌ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బిచ్కుంద మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సంది సాయవ్వ సాయిరాం, వైస్‌ ఛైర్మన్‌గా పెద్ద దేవడాకు చెందిన సీనియర్‌ నేత మలికార్జున్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పిట్లం రాజేశ్వరి ఫంక్షన్‌ హల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసన సభ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్యెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లాల జడ్పి చైర్మన్లు దాదాన్నగిరి విట్ఠల్‌, శోభ ధపెదార్‌ రాజు, ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ గంగాధర్‌ పట్వారీ ముఖ్య అతిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మాట్లాడుతూ మార్కెట్‌ కమిటీ ద్వారా వ్యవసాయ రైతులకు పెద్ద పీట వేసి వారి సంక్షేమాకి పాటుపడటం జరుగుతుందని తెలిపారు. నూతన చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన పాలక వర్గం మార్కెట్‌ కమిటీ ద్వారా వ్యవసాయ రైతులకు అన్ని రకాలుగా సహకారం అందించి వారికి లబ్ధిచేకూర్చడం జరుగుతుందని తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here