రైతులకు, వ్యాపారస్థులకు పెన్షన్.. మోడీ క్యాబినెట్ నిర్ణయం

0
4
చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ స్కీం

చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ స్కీం

దీంతోపాటు చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన అనే మరో కొత్త పథకానికి అమోదం తెలిపారు. దీంట్లో చిన్న, సన్నకారు రైతులకు కంట్రిబ్యూటరీ పెన్షన్‌ను ఇవ్వనున్నారు.కాగా కిసాన్ యోజన ద్వార లబ్దిపోందే చిన్న సన్నకారు రైతులకు ఈ పెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు వ్వవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. కాగా పెన్షన్‌‌కు సంబంధించి రైతులు సగం వాటను చెల్లించాలి.దీంతో మరో సగాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.

పిఎం కిసాన్ పథకం కొనసాగింపు

పిఎం కిసాన్ పథకం కొనసాగింపు

కాగా ఎన్నికల ముందు మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించి మొదటి ధపా అమలు చేసిన పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించాలని మొదటీ క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. కాగా ఈ పథకం రెండున్నర హెక్టార్ల లోపు ఉన్న రైతులకు సంవత్సరానికి ఆరువేల రుపాయలు మూడు దఫాల్లో ఇవ్వనున్నట్టు మోడీ ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఎన్నికు ముందు మొదటి దఫా క్రింద అర్హులైన రైతులకు డబ్బులు కూడ విడుదల చేశారు. కాగా ఈ పథకం ద్వార దేశ వ్యాప్తంగా `15కోట్ల మంది రైతులు లభ్ది పోందుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలోనే ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వ్యాపారస్థులకు పెన్షన్

వ్యాపారస్థులకు పెన్షన్

మరోవైపు పెన్షన్ పథకాన్ని చిన్న, వ్యాపారస్థులకు కూడ అమలు చేయనున్నారు. ఈ పెన్షన్ స్కీంను కోటిన్నర రుపాయల టర్నోవర్ కల్గిన వ్యాపారస్థులకు ఈ పథకం ద్వార లబ్ది చేకూరనుంది. కాగా దీని ద్వార మూడు కోట్ల మంది రిటైల్ వ్యాపారం చేసే వారితో పాటు పలువురు దుకాణాదారులు కూడ పెన్షన్ స్కీం ద్వార లబ్దిపోందనున్నట్టు కటించారు.మరోవైపు జూలై అయిదున పార్లమెంట్‌లో నూతన బడ్జెట్‌ను కేంద్రమం ప్రవేశ పెట్టనున్నట్టు . కాగా అనుహ్యంగా డిఫెన్ మినిస్ట్రీ నుండి ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ను కటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here