రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలో బట్టల దుకాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనను కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ హయాంలో రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో వ్యవసాయ రుణమాపీతోపాటు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ చొరవతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 3 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలు తయారుచేసి పనులు కూడా ప్రారంభించామని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు పెండింగ్‌లో పెట్టి నామమాత్రంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పెండింగ్‌ పనులు త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశ్రీ డబ్బులను ఆయా ఆసుపత్రులకు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ అమలుకాని పరిస్తితి నెలకొందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ చేయకపోగా ఇచ్చిన రుణాలు వసూలు చేసేందుకు బ్యాంకర్లు రైతులను వేదిస్తున్నారని చెప్పారు. సహకార వ్యవస్థ ఏర్పాటైనప్పటినుంచి రైతులకు ఆరుశాతం రిబేటు చెల్లించాల్సి ఉండగా దాన్ని కూడా చెల్లించడం లేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ సైతం చెల్లించడం లేదని, ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరుగారుస్తున్నారని దుయ్యబట్టారు. మునిసిపాలిటిల్లో వార్డుల విభజన, ఓటరు జాబితా తయారీ ఇష్టారాజ్యంగా చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, నిజామాబాద్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నాయకులు తాహెర్‌బిన్‌ హందాన్‌, నగేశ్‌రెడ్డి, భూంరెడ్డి, పండ్ల రాజు, చాట్ల రాజేశ్వర్‌, ఎడ్ల రాజిరెడ్డి, కారంగుల అశోక్‌రెడ్డి, ధాత్రిక సత్యం, గోనె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here