రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం హాన్మాజిపెట్‌లో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి బాన్సువాడ ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్‌ రాం రెడ్డి పరిశీలించారు. వారి వెంట జెడ్పీటిసి పద్మ గోపాల్‌ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని రైతులెవరు అధైర్యపడవద్దని ఎంపిపి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మండల రైతు సమన్వయసమితి అధ్యక్షులు సంగ్రామ్‌ నాయక్‌, సర్పంచ్‌ సుభాష్‌, ఎంపీటీసీ సుధాకర్‌ రెడ్డి, వెంకట్‌ రాం రెడ్డి, సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here