రైతులు వ్యాపార సరళిని అందిపుచ్చుకోవాలి

0
0


రైతులు వ్యాపార సరళిని అందిపుచ్చుకోవాలి

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: రైతులు కొత్త వంగడాలు, నూతన పద్ధతులను అవలంబించి నూతన వ్యాపార సరళిని అందిపుచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యానశాఖ కమిషనర్‌ బీఎన్‌ఎస్‌ మూర్తి, రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ పట్టణం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. 15 రకాల పంటలను వంటల రుచి కోసం ఉపయోగిస్తున్నా తెలంగాణాలో కేవలం ఐదు రకాలు మాత్రమే పండిస్తున్నారని వెల్లడించారు. రూ. కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నామని, రైతులు ఆ పంటల సాగుకు ఆసక్తి చూపితే లాభాలు ఆర్జించొచ్చని సూచించారు. వియత్నాంలో పండించే పసుపు పంటలో కురుకుమిన్‌ అధిక శాతం ఉండడంతో ప్రపంచ మార్కెట్‌లో దానికి డిమాండ్‌ ఉందని, ఆర్మూర్‌ ప్రాంత రైతులు కొత్త వంగడాలను సాగుచేసి ప్రపంచ మార్కెట్‌కు సరఫరా చేయాలని పేర్కొన్నారు. క్షేత్ర పర్యటన అనంతరం మద్దతు ధర, పసుపు బోర్డు, విత్తన శుద్ధి కేంద్రాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో టీఎస్‌హెచ్‌డీసీఎల్‌ మేనేజర్‌ సుభాషిణి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌, పదవీ విమరణ పొందిన ఏరువాక శాస్త్రవేత్త కిషన్‌రెడ్డి, మండల అధికారులు రోహిత్‌, సుమన్‌, హెచ్‌ఈవో సునీల్‌, శశిరాజ్‌, అనిల్‌, రైతులు చిన్నారెడ్డి, సుమన్‌, ముత్తెన్న, నరేష్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here