రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

0
0


రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

గంప గోవర్ధన్‌, పక్కనే ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, తదితరులు

భిక్కనూరు, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి సహకార విండో నూతన భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేసి మాట్లాడారు. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ వినూత్న పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. జంగంపల్లి, శివాయిపల్లి, పొందుర్తి, తలమడ్ల, ఆరేపల్లి గ్రామాల రైతులకు సేవలందిస్తున్న సహకార విండో భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనాన్ని రూ. 24లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, డీసీసీబీ ఛైర్మన్‌ గంగాధర్‌పట్వారి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, ఎంపీపీ గాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింలు యాదవ్‌, ఆత్మకమిటీ ఛైర్మన్‌ నర్సింహారెడ్డి, అమృతారెడ్డి, బల్వంత్‌రావు, మాజీ ఎంపీపీ సుదర్శన్‌ ఎంపీటీసీ సభ్యురాలు యశోద, విండో ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here