రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

0
3


రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: అన్నదాతలు రైతు బీమా పథకానికి అక్టోబరు 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌ తెలిపారు. ఇదివరకు జాబితాలో ఉన్న వారు చేసుకోనవసరం లేదని పేర్కొన్నారు. కొత్తగా పాసుపుస్తకాలు పొందినవారు, ఇంతవరకు చేసుకోనివారు మాత్రమే వివరాలివ్వాలని సూచించారు. దరఖాస్తు ఫారంతోపాటు పట్టా పాసుపుస్తకం, లేదంటే తహసీల్దారు డిజిటల్‌ సంతకం చేసిన ఆన్‌లైన్‌ పత్రం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు సమర్పించాలన్నారు. 1960 ఆగస్టు 14 నుంచి 2001 ఆగస్టు 14 మధ్యలో పుట్టిన వారే ఈ పథకానికి అర్హులని, 18-59 ఏళ్ల లోపు ఉన్న వారు మండల వ్యవసాయాధికారికి దరఖాస్తు ఇవ్వాలని సూచించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here