రైలెక్కి పరారైన దొంగ.. విమానంలో వెళ్లి, వెల్‌కం చెప్పిన పోలీసులు!

0
0


దొంగ పారిపోవడం.. వాళ్ల వెనుక పోలీసులు పరుగులు పెట్టడం మనకు తెలిసిందే. అయితే, ఈ పోలీసులు బాగా తెలివైనవాళ్లు.. రైల్లో పారిపోతున్న దొంగను రోడ్డు మార్గంలో వెంబడించడం వేస్ట్ అనుకున్నారు. కూల్‌గా విమానం టికెట్ తీసుకుని.. రిలాక్స్‌గా కూర్చున్నారు. దొంగ దిగే ప్రాంతం ఎక్కడో ముందే తెలియడంతో అతడు రైలు దిగే లోపే పుష్టిగా భోజనం చేసి.. రైల్వే స్టేషన్‌లో తిష్ట వేశారు. దొంగగారికి గ్రాండ్ వెల్‌కాం చెప్పారు.

Also Read: పోలీసులను పరుగులు పెట్టించిన ‘దెయ్యం’.. అసలు విషయం తెలిసి షాక్!

ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చోటుచేసుకుంది. 22 ఏళ్ల కౌశల్ సింగ్.. తాను పనిచేస్తున్న ఇంటి యజమాని ఇంట్లోని బంగారు నగలు అపహరించాడు. అయితే, ఈ ఘటనపై యజమాని పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో కౌశల్ అజ్మీర్ సమీపంలోని తన స్వగ్రామానికి రైల్లో బయల్దేరినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

రోడ్డు మార్గంలో అజ్మీర్ వెళ్లి దొంగను పట్టుకోవాలంటే సుమారు మూడు రోజులు పడుతుంది. అలాగే, రైల్లో వెళ్లినా కౌశల్ తప్పించుకొనే అవకాశం ఉంటుంది. దీంతో విమానం టికెట్ తీసుకుని అజ్మీర్ వెళ్లారు. కౌశల్ అక్కడికి చేరుకొనేసరికే పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు దిగగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ట్యాక్సీ డ్రైవర్‌తో గొడవ.. నడి రోడ్డుపై దుస్తులు విప్పేసి మహిళ హంగామా

అనంతరం విమానంలో బెంగళూరుకు తీసుకెళ్లిపోయారు. దొంగలించిన నగలను కౌశల్ అమ్మలేదు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో అతడు నేరాలేవీ చేయలేదని, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతడు తొలిసారి ఈ చోరీ చేశాడని పోలీసులు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here