రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఆటోరిక్షా పరుగులు.. గర్భిణీని హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సాహసం

0
0


ద్దీగా ఉన్న రైల్వే ప్లాట్‌ఫామ్‌‌పై ఆటో రిక్షా పరుగులు పెట్టింది. గట్టిగా హారన్ కొడుతూ వెళ్తున్న ఆ ఆటో డ్రైవర్‌ను చూసి ప్రయాణికులంతా మొదట్లో తిట్టుకున్నారు. అయితే, అసలు విషయం తెలిసిన తర్వాత ప్రశంసలతో ముంచెత్తారు. ముంబయిలోని విరార్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి సోమవారం లోకల్ రైల్‌లో ఆసుపత్రికి బయల్దేరింది. అయితే, వర్షాల వల్ల ఆ రైలు విరార్ రైల్వే స్టేషన్‌లో ఆగిపోయింది. అదే సమయంలో ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో కంగారు పడిన భర్త.. ఆమెను రైలు నుంచి కిందికి దింపాడు. అనంతరం ప్లాట్‌ఫామ్‌కు సమీపంలో ఉన్న ఆటో రిక్షాస్టాండ్‌లోకి వెళ్లి పరిస్థితి తెలిపాడు. దీంతో సాగర్ కమలాకర్ గవాడ్ అనే ఆటో డ్రైవర్ వెంటనే తన ఆటోను తీసుకుని ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చాడు.

రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యం అవుతుందని భావించి.. ఫ్లాట్‌ఫామ్ మీద నుంచే ఆసుపత్రి వైపు ప్రయాణించాడు. సంజీవనీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రోజు కమలాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్లాట్‌ఫామ్ మీద ఆటో నడపడం నేరమని తెలిపారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇందుకు అతడు చెప్పిన కారణం విని పోలీసులు, న్యాయమూర్తి కమలాకర్‌ను ప్రశంసించారు. అనంతరం అతడికి ఎలాంటి జరిమానా విధించకుండా వదిలిపెట్టారు.

Read also: రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై ఆటోరిక్షా చక్కర్లు.. షాకైన ప్రయాణికులు!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here