రొమాంటిక్ ఫస్ట్ లుక్: హాట్ కాదు.. అరాచకం అంతే

0
1


ఒకప్పుడు బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమయిన హాట్ సీన్స్, బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కామన్ అయిపోయాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అవి లేకుండా సినిమా తియ్యడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. పెద్ద హీరో అయినా, యంగ్ హీరో అయినా కూడా సినిమాకి మైలేజ్ పెంచే ఆ సీన్స్ మాత్రం కామన్ కంటెంట్. పెద్ద సినిమాలో అయినా కూడా లిప్ లాక్స్ లేకపోతే ట్రెండ్‌కి దూరంగా ఉన్నారు అనేస్తున్నారు అని ఆ తరహా సీన్ ఒకటయినా ఉండేలా చూసుకుంటున్నారు.

Also Read: పూరి హీరోయిన్ పిచ్చ హాట్.. కుర్రాళ్లకు పండగే!

బోల్డ్ సీన్స్‌ని తెరకెక్కించడంలో పూరి మార్క్ వేరు. ఎలాంటి హీరోకి అయినా తన సినిమాలో మేకోవర్‌తో ఒక కొత్త లుక్‌తో పాటు కొత్త ఇమేజ్ కూడా ఇచ్చే పూరి హీరోయిన్స్‌కి అయితే తన సినిమాతో ఏకంగా లైఫ్ ఇచ్చేస్తాడు. ఇలియానా నుండి ఇప్పుడు నభా నటేష్ వరకు అనేకమంది హీరోయిన్స్ పూరి ప్రోడక్ట్స్. ఆయన కళ్ళలో పడి మెప్పించగలిగితే ఆమె హాట్ ఎస్సెట్స్ ఏంటి అనేది తన సినిమాల్లో వెండితెరపై ఆరబోసి మరీ ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు పూరి స్కూల్ నుండి వస్తున్న రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ కేతికా శర్మ దశ కూడా ఈ ఒక్క సినిమాతో మారిపోతుంది అనిపిస్తుంది రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఎక్స్పోజింగ్ అనే మాటని పీక్స్‌లో ప్రెసెంట్ చేసి చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అనేలా ఆ ఫస్ట్ లుక్‌ని ప్రెజెంట్ చేసారు.

ఆ పోస్టర్‌లో కేతికా శర్మ టాప్ లెస్‌గా కనిపిస్తుంది. ఆకాష్ పూరిని గట్టిగా హత్తుకుంది. ఆ హాట్ కౌగిలి ఆవిరిలోని ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు రొమాంటిక్ హీరో ఆకాష్ పూరి. కానీ ఆ ఫస్ట్‌లుక్ పై నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు కుర్రాళ్ళు. ఆ సినిమా టైటిల్‌కి జస్టిఫికేషన్ చేస్తూ ఫస్ట్ లుక్‌లోనే ఈ రేంజ్‌లో ట్రీట్ ఇచ్చారంటే సినిమాలో ఇంకెలాంటి డోస్ ఉండబోతుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్‌తో విజయం అందుకున్న పూరి కనెక్ట్స్‌కి ఈ సినిమా కూడా అదే రేంజ్ విజయం అందించబోతుందని అనే ఇంప్రెషన్ కలిగించింది ఈ పోస్టర్. గతంలో కళ్యాణ్ రామ్ కంపెనీలో విజువల్ ఎఫెక్స్ట్ సూపర్ వైజర్‌గా పనిచేసిన అనిల్ పాదూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అతనికి కూడా డైరెక్టర్‌గా స్టాండ్ ఇచ్చేలా ఉంది ఈ ఫస్ట్ లుక్.

Also Read: సాఫ్ట్‌వేర్ సుధీర్ : మొత్తం కామెడీనే

ఆకాష్ పూరి నటించిన ఆంధ్రాపోరి, మెహబూబా రెండు సినిమాలు కూడా నిరాశపరచడంతో ఇప్పటివరకు రొమాంటిక్ సినిమాపై అంచనాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని యూత్ మొత్తం ఎదురుచూసేలా ఈ ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించారు. ఇస్మార్ట్ శంకర్‌లో మాస్‌ని టార్గెట్ చేసిన పూరి ఈ సారి యూత్‌ని టార్గెట్ చేశారు. మొత్తానికి ఈ ఒక్క పోస్టర్‌తో రొమాంటిక్ రచ్చ స్టార్ట్ చేసేసాడు. థియేటర్స్‌లో రాక్ చేస్తాడో లేదో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here