రోడ్డుపై కుక్క.. దానిపై నుంచే వాహనాలు, చివర్లో పేద్ద ట్విస్ట్!

0
3


రోడ్డు మీద కుక్క పడుకుని ఉంది. దాని పక్క నుంచే వాహనాలు వెళ్తున్నా.. ఆ కుక్క కదల్లేదు మెదల్లేదు. ఆ వాహనాలు దానికి చాలా దగ్గర నుంచి వెళ్తుంటే మనకు భయం కూడా వేస్తుంది. చివరికి ఓ రిక్షా అటుగా రావడంతో ఆ వీడియో వెనుక ఉన్న గుట్టు రట్టయ్యింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పుడు మన హైదరాబాద్ పోలీసులకు కూడా బాగా నచ్చేసింది. దీంతో ఆ వీడియోను తమ పేజీలో పోస్టు చేసి.. ‘‘సోషల్ మీడియాలోని ప్రతి పోస్టును నమ్మకండి’’ అని పేర్కొన్నారు.

Also Read: నదిలో పడిన కారు, పసివాడిని వంతెనపైకి విసిరి… వీడియో వైరల్

ఇంతకీ ఈ వీడియోలో ఏముందనే కదా మీ డౌట్. ఓ రోడ్డు మీద పడుకున్న కుక్క పక్క నుంచి వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. దీంతో ఏదైనా వాహనం దాని మీదకు ఎక్కేస్తుందేమో అని మనకు భయం వేస్తుంది. చివర్లో ఓ సైకిల్ ఆ పడుకున్న కుక్క కింద నుంచి వెళ్లిపోతుంది. అప్పటికి కానీ అర్థం కాదు.. ఆ కుక్క నిజంగా అక్కడ పడుకోలేదని, గ్రాఫిక్స్‌తో ఆ వీడియోలో యాడ్ చేశారని. ఈ విషయాన్ని మాటల్లో చెప్పడం కంటే.. వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను చివరికి వరకు చూడండి.

వీడియో:

Also Read: ఇంటికి నిప్పుపెట్టిన కుక్క.. నిఘా కెమేరాకు చిక్కిన దృశ్యం

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here