రోడ్డుపై నాట్లు వేసిన ఆర్‌ఎస్‌పి కార్యకర్తలు

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లోని భిక్కనూరు మండల కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌ నుండి తహసీల్‌ కార్యాలయం లక్ష్మీ దేవుని పల్లి వెళ్లే రోడ్డు మొత్తం గుంతలు బురదతో నిండి పోయిందని ప్రభుత్వ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆర్‌ఎస్‌పి కార్యకర్తలు అన్నారు. రోడ్డు ద్వారా ఆఫీసు లోకి వెళ్లే ప్రజలతో పాటు సామాన్య ప్రజలు, ప్రభుత్వ అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డును బాగు చేసి దానికి సీసీ రోడ్డు మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు గిరిజనులు నివసిస్తున్న తండాలకు రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీస మౌలిక సదుపాయాల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గరికి నున్నటి రోడ్లను నిర్మించుకున్నప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ రాజభోగాల కోసం ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు చెడిపోయిన రోడ్లు, గుంతలను పూడ్చాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జి.స్వామి, నరేష్‌, బాబు, సంగ భూమయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here