రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

0
0


రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

 

సాయన్న   -   మురళి

 

ఆర్మూర్‌ గ్రామీణం: ఆర్మూర్‌ మండలంలో సోమవారం రెండు వేర్వురు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. నందిపేట్‌ మండలం జి.జి.నడ్కుడకు చెందిన సాయన్న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ శివారులో అదుపుతప్పి కింద పడటంతో ఆయన ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడకు చెందిన మురళి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ శివారులో మూల మలుపు వద్ద వాహనం అదుపు తప్పి కింద పడడంతో తలకు, ముఖానికి, కాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here