రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

0
2


రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


మృతి చెందిన కిశోర్‌

బాడ్సి, ముదక్‌పల్లి(మోపాల్‌) న్యూస్‌టుడే: మోపాల్‌ మండలం బాడ్సి-ముదక్‌పల్లి కూడలి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కిశోర్‌(32) అనే యువకుడు మృతి చెందాడు. మోపాల్‌ ఏఎస్సై బాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాడ్సి గ్రామానికి చెందిన కిశోర్‌ తన స్నేహితుడు లక్ష్మణ్‌తో ముదక్‌పల్లి కూడలికి వెళ్తుండగా.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహం సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌ స్వల్ప గాయాలతో బయటపడగా.. కిశోర్‌ తలకు బలమైన గాయాలవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here