రోడ్లు, మునిసిపల్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌ ద్వారా మంజూరైన రోడ్లు, మునిసిపల్‌ పనులను వెంటనే పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బి, పంచాయతీ, మునిసిపల్‌, డిఇ, ఇఇలతో ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జివో 129 అనుసరించి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కలిపే సింగిల్‌ లైన్‌ను డబుల్‌ లైన్‌గా మార్చడం, జివో 130 అనుసరించి డబుల్‌ లైన్‌ రహదారిగా మార్చడం, జివో 131 ప్రకారం నూతన వంతెనల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మునిసిపాలిటిల్లో వార్డుల వారిగా సిసిరోడ్లు, కాలువలు, ఆడిటోరియం, సెంట్రల్‌ లైటింగ్‌, పార్కులు, వైకుంఠ ధామం, వీధి దీపాలు, శాసన సభ్యుల క్యాంపు కార్యాలయాలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బి డిఇ మహేందర్‌, ఇఇ శ్రీను, మునిసిపల్‌ ఇఇ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here