రోళ్లగడ్డ బూటకపు ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు చేయాలి

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోళ్లగడ్డ బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులందరిపై హత్యకేసు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేయాలని సిపియుఎస్‌ఐ రాష్ట్ర నాయకులు కట్ల భూమన్న, కమ్యూనిస్టు నాయకులు డిమాండ్‌ చేశారు. సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర నాయకుడు, అజ్ఞాత దళ కమాండర్‌ కామ్రేడ్‌ లింగన్న బూటకపు ఎన్‌కౌంటర్‌ను దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం వారు సాగుచేసుకుంటున్న పోడు భూముల రక్షణ కోసం నిరంతరం శ్రమించి పోరాడిన లింగన్నను ఎన్‌కౌంటర్‌ పేరిట పట్టుకొని కాల్చి చంపడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌ పేరిట కథలు అల్లడం సిగ్గుచేటన్నారు. ఘటనలో పాల్గొన్న పోలీసులందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. హత్య కాండలను ప్రభుత్వం ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాశ్‌, ఎల్‌.ఎన్‌.ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here