లండన్‌కు బుమ్రా: ముగ్గురు నిపుణులు వేర్వేరుగా పరీక్షిస్తారు!

0
3


హైదరాబాద్: గాయంతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన జస్ప్రీత్ బుమ్రాకు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించేందుకు యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) పంపుతున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసింది.

గాయంతో సొంతగడ్డపై బుధవారం నుంచి ఆరంభమయ్యే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌‌కు జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలలు పాటు బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్నాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు పేసర్ ఉమేశ్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

టాస్ నెగ్గడంలో చెత్త రికార్డు: ఆసీస్-లంక మ్యాచ్‌లో వింత ఘటన (వీడియో)

బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ

బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ

ఈ సందర్భంగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ “తదుపరి చికిత్స కోసం బుమ్రాను లండన్‌కు పంపుతున్నాం. అతని వెంట ఎన్సీఏ హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఆశిస్‌ కౌశిక్‌ వెళుతున్నారు. బుమ్రాను ముగ్గురు నిపుణులతో కూడిన బృందం వేర్వేరుగా పర‍్యవేక్షిస్తుంది” అని ఆయన తెలిపారు.

అక్టోబర్ 6 లేదా 7వ తేదీల్లో

అక్టోబర్ 6 లేదా 7వ తేదీల్లో

“అక్టోబర్ 6 లేదా 7వ తేదీల్లో బుమ్రా లండన్‌కు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు లండన్‌లోనే బుమ్రా ఉంటాడు. అక్కడ డాక్టర్ల అభిప్రాయం తీసుకుని దానిని బట్టి బుమ్రా ప్రణాళిక ఏమిటనేది ఉంటుంది. బుమ్రా గాయం(స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌) నుంచి ఎన్ని రోజులకు తేరుకుంటాడనేది లండన్‌కు వెళ్లిన తర్వాత స్పష్టత వస్తుంది” అని ఆయన తెలిపారు.

బంగ్లాతో సిరిస్‌కు బుమ్రా అనుమానమే

బంగ్లాతో సిరిస్‌కు బుమ్రా అనుమానమే

గాయంతో బంగ్లాదేశ్‌తో జరుగనున్న తదుపరి సిరీస్‌లో కూడా బుమ్రా పాల్గొనడం అనుమానంగా ఉంది. తన మూడున్నరేళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో బుమ్రాకు ఇది తొలి అతిపెద్ద గాయం కావడం విశేషం. కాగా, బుమ్రా వెన్నునొప్పికి అతడి వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షనే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. గాయాలకు, యాక్షన్‌కు సంబంధం ఉండదని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.

బౌలింగ్‌ యాక్షన్‌ వల్ల వెన్నునొప్పి రాదు

బౌలింగ్‌ యాక్షన్‌ వల్ల వెన్నునొప్పి రాదు

‘బౌలింగ్‌ యాక్షన్‌ వల్ల వెన్నునొప్పి రాదు. బుమ్రా యాక్షన్‌ను మార్చుకోనక్కర్లేదు. అలా ప్రయత్నిస్తే.. సరైన ఫలితాలు రాకపోవచ్చు. బుమ్రా అదే యాక్షన్‌, పేస్‌తో మళ్లీ బౌలింగ్‌ చేయాలి. బాల్‌ విసిరేటప్పుడు అతడి శరీరం పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. మలింగ కన్నా బుమ్రా యాక్షన్‌ 10 రెట్లు మెరుగ్గా ఉంటుంది’ అని నెహ్రా తెలిపాడు.

రెండు నెలలు క్రికెట్ దూరం!

రెండు నెలలు క్రికెట్ దూరం!

‘వెన్ను గాయం నుంచి కోలుకోవటానికి బుమ్రాకు దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లు ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. మ్యాచ్‌కు ఎప్పుడు సిద్ధమనే విషయం ఆటగాడికి మాత్రమే తెలుసు. ఇతర గాయాల మాదిరిగా వెన్ను గాయం అంత తేలికైనది కాదు. ఈ గాయాన్ని ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించలేం. ఎముకల స్కాన్‌ ప్లేట్స్‌ మాత్రమే గుర్తిస్తాయి’ అని నెహ్రా పేర్కొన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here