లక్కీ ఫ్యాన్: తన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ బైక్‌పై ధోని ఆటోగ్రాఫ్‌ (వీడియో)

0
4


హైదరాబాద్: టీమిండియాకు ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు గాక… లక్కీ ఫ్యాన్ మాత్రం ఇతడే. ఎందుకంటే ధోని ఆటోగ్రాఫ్‌ని తాను కొత్తగా కొనుకున్న రాయల్ ఇన్‌ఫీల్డ్ క్లాసిక్ మోటార్ బైక్‌పై పొందడం అంటే మామాలు విషయం కాదు. ధోని ఇచ్చిన ఈ ఆటోగ్రాఫ్ ఆతడికి జీవితాంతం గుర్తుండిపోతుంది.

సాధారణంగా క్రికెటర్లు జెర్సీలు, టీషర్ట్‌లు లేదా క్యాప్‌లపై అభిమానులకు తమ ఆటోగ్రాఫ్‌లను ఇస్తుంటారు. అయితే, జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి ధోని అంటే అభిమానం. దీంతో తాను కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌పై ధోని ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆరాటపడ్డాడు. షోరూంలో బైక్ కొనుగోలు చేసిన వెంటనే నేరుగా రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు.

రాయల్ ఇన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్‌పై ధోని ఆటోగ్రాఫ్

ధోని ప్రాక్టీస్ ముగించుకుని వస్తోన్న సమయంలో తన ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. తన అభిమాని అడిగిన దానిని దోని కాదంటాడు. అభిమాని అడిగిన వెంటనే ఏమాత్రం తడుముకోకుండా ధోని అతడి రాయల్ ఇన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ధోనికి బైకులు అంటే ఎంతో ఇష్టం

ధోనికి బైకులు అంటే ఎంతో ఇష్టం

కాగా, ధోనికి బైకులు అంటే ఎంతో ఇష్టం. 2016లో ఓ ఇంటర్యూలో ధోని తన వద్ద 74 అత్యాధునిక బైకులు ఉన్నట్లు వెల్లడించాడు. ఇటీవలే భారత సైనికులు ఉపయోగించే ‘నిసాన్‌ జోంగా’ మోడల్‌ జీపును మహీ కొనుగోలు చేసాడు. ధోనీ ఆదివారం రాంచీ వీధుల్లో కొత్తగా కొన్న నిసాన్‌ జోంగా జీపును నడుపుతూ ఆస్వాదించాడు.

బంగ్లా సిరిస్‌కు ఎంపిక కాని ధోని

బంగ్లా సిరిస్‌కు ఎంపిక కాని ధోని

ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు.

కుటుంబ సభ్యులతో ఎంజాయ్

కుటుంబ సభ్యులతో ఎంజాయ్

అయితే, వచ్చే జనవరిలో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధోని తన ట్రైనింగ్‌ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా జిమ్‌లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ అందుకోవడానికి జార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here