లక్ష్మి విలాస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు… ప్రభావం ఎలా ఉంటుందంటే?

0
2


లక్ష్మి విలాస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు… ప్రభావం ఎలా ఉంటుందంటే?

లక్మి విలాస్ బ్యాంక్ (LVB) పై భారత రిజర్వు బ్యాంకు (ఆర్ బీ ఐ) సరికొత్త ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకును దిద్దుబాటు చర్యలు సంభందించిన నిబంధనల పరిధిలోకి తెచ్చింది. బ్యాంకు పని తీరును మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని , ఇందులో భాగంగానే చర్యలు తీసుకున్నట్టు ఆర్ బీ ఐ వెల్లడించింది.

బ్యాంకు మొండిపద్దులు (ఎన్ పీ ఏ) అధికంగా ఉండటం, మూలధనం సరిపోయేంతగా ఉండకపోవడం కూడా బ్యాంకుపై ఆర్ బీఐ చర్యలు తీసుకోవడానికి కారణమయ్యాయి.

అయితే ఆర్బీఐ తీసుకున్న చర్యల ఫలితంగా బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.

*ఆర్బీఐ ఆంక్షలు నేపథ్యంలో బ్యాంకు కార్పొరేట్ రుణ వితరణను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రంగాలకు రుణాలను తగ్గించాలి. ఇప్పటికైతే బ్యాంకు పై ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి. పనితీరు మెరుగు పరచుకోక పోతే బ్యాంకు శాఖల విస్తరణ లేదా డివిడెండ్ చెల్లింపులపైనా కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది.

* ఇండియా బుల్స్ ఫైనాన్స్ లో లక్ష్మి విలాస్ బ్యాంక్ విలీనం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన భారత రిజర్వ్ బ్యాంకు వద్ద పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకుపై ఆంక్షలు విధించడం గమనార్హం.

* తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంకు ఈ ఏడాది జూన్ తో ముగిసిన త్రైమాసికానికి రూ. 237 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నష్టం రూ. 124 కోట్లుగా ఉంది.

* బ్యాంక్ స్థూల మొండి పద్దులు మొత్తం రుణాల్లో 10.73 శాతం నుంచి 17.30 శాతానికి పెరిగాయి.

* 2018-19 సంవత్సరంలో నష్టాలు రూ. 894. 10 కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.584.87 కోట్లుగా నమోదయ్యాయి.

ఇంతకు ముందు మరికొన్ని బ్యాంకులపై…

* రిజర్వ్ బ్యాంకు ఇంతకు ముందు కూడా పలు ప్రభుత్వ రంగంలోని పలు బ్యాంకులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల ఆయా బ్యాంకులు కొన్ని రోజులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

* అయితే తర్వాతి కాలంలో ఈ బ్యాంకులు తమ పనితీరును మెరుగు పరచుకొని ఆర్ బీ ఐ ఆంక్షల నుంచి బయట పడ్డాయి. అయితే దీనికి కొంతకాలం పట్టింది. దిద్దుబాటు చర్యలకు సంబంధించిన ఆంక్షలు ఉండటం వల్ల బ్యాంకులు విస్తరణతో పాటు నిధుల సమీకరణకు సంభందించిన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డైరెక్టర్ పై కేసు ..

* చీటింగ్, నేరపూరితమైన కుట్ర తదితరాల కింద ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ వింగ్ లక్ష్మి విలాస్ బ్యాంక్ డైరెక్టర్, బోర్డ్ సభ్యులు, ఇతరులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. రెలిగేర్ ఫిన్ వెస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here