లక్ష్మీనరసింహుడి ఆలయంలో భక్తుల కోలాహలం

0
4


లక్ష్మీనరసింహుడి ఆలయంలో భక్తుల కోలాహలం

మాచారెడ్డి, న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని లక్ష్మీనరసింహుడి ఆలయంలో శనివారం భక్తజన కోలాహలం నెలకొంది. శ్రావణమాసం ఆ పైగా శనివారం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. భక్తులు తమ వాహనాలకు పూజలు చేయించారు. నూతన దంపతులు అమ్మవారికి ఒడి బియ్యాలు పోశారు. సంతానం లేని మహిళలు అల్లుబండ పట్టి పరీక్షించుకున్నారు. ఆలయానికి వచ్చిన అశేష భక్తజనం లక్ష్మీ సమేతుడైన నరసింహుడిని కొలిచి తరించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here