లక్ష్మీనరసింహుడి ఆలయానికి భక్తుల తాకిడి

0
0


లక్ష్మీనరసింహుడి ఆలయానికి భక్తుల తాకిడి

ఆలయం ఆవరణలో హోమం నిర్వహిస్తున్న ప్రతినిధులు

చుక్కాపూర్‌, లక్ష్మీరావులపల్లి (మాచారెడ్డి), న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయానికి బుధవారం భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు తమ గండాలు బాపాలంటూ స్వామి వారికి గండ దీపాలు వెలిగించారు. లక్ష్మీ సమేతుడైన నరసింహుడికి భక్తులు పట్టెనామాలు, కోరమీసాలు, ముక్కు, కండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంతానం లేని మహిళలు అల్లుబండ పట్టి పరీక్షించుకున్నారు. నూతన దంపతులు అమ్మవారికి ఒడిబియ్యాలు పోసి ముడుపులు కట్టారు. ఆలయ ఆవరణలోని శ్రీ ఆదిశేషుడు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లోనూ భక్తులు పూజలు నిర్వహించారు.

శ్రీ రాజరాజేశ్వరి ఆలయ వార్షికోత్సవం

కామారెడ్డి పట్టణం: జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్‌లో శ్రీ రాజరాజేశ్వరి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మహిళలు అలంకరణ చేశారు. గణపతి పూజ, హోమం, కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు సురేష్‌, కార్యదర్శి గంగాధర్‌, ప్రతినిధులు క్రాంతి, సాయిలు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, మణికంఠశర్మ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here