లక్ష్మీనరసింహుడి దర్శనానికి కిక్కిరిసిన భక్తజనం

0
1


లక్ష్మీనరసింహుడి దర్శనానికి కిక్కిరిసిన భక్తజనం

లక్ష్మీనరసింహుడి మూలవిరాట్టు

చుక్కాపూర్‌, లక్ష్మీరావులపల్లి (మాచారెడ్డి), న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని లక్ష్మీనరసింహుడి దర్శనానికి భక్తులు శనివారం కిక్కిరిశారు. శ్రావణ మాసం ఆఖరు శనివారం కావడంతోనే ఆలయానికి భక్త జనం తండోప తండాలుగా తరలి వచ్చి లక్ష్మీసమేతుడైన నరసింహుడి దర్శనానికి బారులు తీరారు. భక్తులు తమ గండాలు తొలగించాలంటూ.. స్వామి వారికి గండ దీపాలు తీశారు. నరసింహుడికి భక్తులు పట్టెనామాలు, కోర మీసాలు, ముక్కు, కళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నూతన దంపతులు అమ్మవారికి ఒడి బియ్యాలు పోసి ముడుపులు కట్టారు. పలువురు భక్తులు శ్రావణ మాసం ఉపవాస దీక్షలను విడిచారు. సంతానం లేని మహిళలు అల్లుబండ పట్టి పరీక్షించుకున్నారు. ఆలయానికి తరలి వచ్చిన భక్తులు వసతులు లేక ఇబ్బందులు పడ్డారు.

దర్శనానికి కిక్కిరిసిన భక్తజనంSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here