లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, దూసుకెళ్తున్న అరబిందో

0
1


లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, దూసుకెళ్తున్న అరబిందో

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. పదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 132.23 పాయింట్లు లాభపడి 36,822.73 వద్ద ఉంది. నిఫ్టీ 37.60 పాయింట్లు లాభపడి 10,893.10 వద్ద కొనసాగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.04 శాతం తగ్గి 70.84 వద్ద ఉంది. పది గ్రాముల బంగారం (ఎంసీఎక్స్) ధర రూ.221 తగ్గి రూ.37,997 వద్ద ఉంది.

అరబిందో ఫార్మా, ఇండియా బుల్స్, ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, యస్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మదర్సన్ సుమీ, టాటా స్టీల్, సిప్లా, గ్రాసిమ్, మారుతీ సుజుకీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

మరోవైపు, అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో చమురు ధరలు భారీ పతనం తర్వాత గురువారం నాడు కాస్త కోలుకున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ 2.29 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.52 డాలర్ల వద్ద డబ్ల్యుటీఐ క్రూడ్ 2.54 శాతం పెరిగి బ్యారెల్‌కు 52.39 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా – చైనా ట్రేడ్ వార్ భయం మదుపర్లను వెంటాడుతున్నాయి. దీంతో గత సెషన్లో 4 శాతం మేర పడిపోయాయి.

అరబిందో ఫార్మా భారీ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. రూ.40.75 పెరిగి 595.45 వద్ద ట్రేడ్ అవుతంది. అరబిందో ఫార్మా మొదటి క్వార్టర్‌లో రూ.635.80 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్వార్టర్ ఈపీఎస్ రూ.10.85గా ఉంది. అమెరికా, ఐరోపా ఆదాయాలు పెరిగాయి. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.455.70కోట్లు కాగా, ఇప్పుడు భారీగా పెరిగింది. తొలి క్వార్టర్ ఏకీకృత ఆదాయం రూ.5444.60 కోట్లు. అంతకుముందు ఇదే కాలంలో రూ.4,250.27 కోట్లు. అంటే గత ఏడాది కంటే 28.1 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here