లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి సెన్సెక్స్: ఒడిదుడుకుల్లో మార్కెట్లు

0
2


లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి సెన్సెక్స్: ఒడిదుడుకుల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిన్న (అక్టోబర్ 31) సెన్సెక్స్ 40,129 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,877 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 40,191 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,888 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 491 షేర్లు లాభాల్లో, 224 షేర్లు నష్టాల్లో ప్రారంభించగా, 41 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఉదయం పదిన్నర గంటల సమయంలో లాభపడిన షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, టాటా స్టీల్స్, ఐటీసీ, హీరో మోటో కార్ప్, సన్ ఫార్మా, మారుతీ, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఆటోలు ఉన్నాయి.

ఇన్ఫోసిస్, పవర్ గ్రిట్, ఎల్ అండ్ టి, ఏషియన్ పేయింట్స్, హిందూస్తాన్ యూనిలీవర్, భారతి ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, యస్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.

మధ్యాహ్నం గం.12.04 సమయానికి సెన్సెక్స్ 38.31 (0.095%) పాయింట్లు నష్టపోయి 40,090.74 (నిన్నటి ముగింపుతో) ట్రేడ్ అయింది. నిఫ్టీ 9.65 (0.081%)

పాయింట్లు తగ్గి 11,867.80 వద్ద ట్రేడ్ అయింది. పార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభాల్లో ఉండగా, ఇన్ఫ్రా, ఆటో, ఎనర్జీ, మెటల్ రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి.

మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్‌లో జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్ ఉన్నాయి. టాప్ లూజర్స్‌లలో యస్ బ్యాంకు, ఐవోసీ, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీలు ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here