లారీ అపహరణ

0
3


లారీ అపహరణ

270 క్వింటాళ్ల బియ్యం మాయం

బోధన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ చౌక దుకాణాలకు సరఫరా చేసే బియ్యం మాయమైన ఘటన ఇది. లారీని అపహరించి అందులోని బియ్యం బస్తాలు ఖాళీ చేశారు. ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి (కస్టమ్‌ మిల్లింగ్‌) పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు పంపుతుంది. ఈ విధంగా బీర్కూరు మండలంలోని సిద్ధివినాయక బియ్యం మిల్లు నుంచి 270 క్వింటాళ్ల బియ్యం శనివారం రాత్రి బోధన్‌కు(చెక్కీ క్యాంపు శివారు) లారీలో వచ్చాయి. భారత గిడ్డంగుల సంస్థ (ఎఫ్‌సీఐ) బస్తాలను ఖాళీ చేస్తుంది. వర్షం కురవడంతో లారీని వరుసలో పెట్టి డ్రైవర్‌ వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం వచ్చి చూసే సరికి లారీ కనబడలేదు. యాజమాని సంతోష్‌కుమార్‌కు సమాచారమిచ్చి వెతికారు. చివరకు పట్టణ సీఐ నాగార్జున్‌గౌడ్‌కు ఫిర్యాదు చేయగా ఆయన పోలీసులను పంపించారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అదే శివారులోని ఒక వాగు వద్ద లారీ కనబడింది. పరిశీలించగా అందులో బియ్యం బస్తాలు లేవు. వాటి విలువ రూ.6.20 లక్షలు ఉంటుంది. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here