లిఫ్ట్‌లో చిక్కుకున్న పెళ్లికొడుకు.. 50 నిమిషాలు టెన్షన్.. టెన్షన్!

0
3


పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిథులు కూడా వచ్చేశారు. పెళ్లి కూతురు కూడా సిద్ధమైపోయింది. కానీ, పెళ్లి కొడుకు మాత్రం వేదిక వద్దకు చేరుకోలేదు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే.. అతడు లిఫ్టులో చిక్కుకున్నాడని తెలిసింది. దీంతో పెళ్లివారంతా కంగారు పడిపోయారు. సుమారు గంట సేపు శ్రమించి పెళ్లి కొడుకును లిఫ్టు నుంచి బయటకు తీశారు.

Read also: కండోమ్ ఉంటే చలానా వేయరట.. క్యాబ్ డ్రైవర్లకు కొత్త రూల్!

చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్బిన్ ప్రాంతంలోని లవాండే హోటల్‌లోని 11వ అంతస్థులో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేశారు. దీంతో వరుడు జాంగ్, అతని కుటుంబ సభ్యులు కలిసి లిఫ్టు ఎక్కాడు. సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది.

Read also: ప్రయాణికులు లేకుండా.. 46 విమానాలను ఖాళీగా నడిపిన పాకిస్థాన్!

లిఫ్ట్ ఆగిన వెంటనే జాంగ్ ఎమర్జెన్సీ బటన్ నొక్కి హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేశాడు. అయితే, లిఫ్ట్ మెయింటెనెన్స్ సిబ్బంది వెంటనే స్పందించలేదు. ఆ సమయానికి లిఫ్టును ఆపరేట్ చేసే వ్యక్తి లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 50 నిమిషాలు తర్వాత పెళ్లి కొడుకును, కుటుంబ సభ్యులను విజయవంతంగా లిఫ్టు నుంచి బయటకు తీశారు. ‘‘లిఫ్ట్ మొదటి, రెండో అంతస్తులకు మధ్యలో ఆగిపోయింది. ఓవర్ లోడ్ వార్నింగ్ కూడా ఏమీ రాలేదు’’ అని జాంగ్ తెలిపాడు. ఆలస్యమైనా మొత్తానికి పెళ్లయితే జరిగింది. దీంతో ఇరు కుటుంబ పెద్దలు హమ్మయ్యా అనుకున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here