లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పంట పొలాలు సస్యశ్యామలం

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి జక్కాపూర్‌ గ్రామ శివారులో మంజీర నదిపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్థలాన్ని మ్యాప్‌ను అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజులు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరానికి కాలేశ్వరం ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఎప్పుడూ నీటితో కళకళలాడుతుందన్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 40 వేల ఎకరాలకు పిట్లం, పెద్ద కొడప్గల్‌, బిచ్కుందలకు సాగునీరు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 476 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి గడపగడపకు అభివద్ధి పథకాలు అందుతున్నాయని అన్నారు. వచ్చేనెల 11, లేదా 12 ,13 తేదీలలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు సిఎం కేసీఆర్‌ భూమి పూజ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎయంసి చైర్మన్‌ గైని విఠల్‌, సీడీసీ చైర్మన్‌ దుర్గా రెడ్డి నాలుగు మండలాల ఎంపీపీ అశోక్‌ పటేల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, నాయకులు గంగారెడ్డి, సర్పంచులు బంజా కంసవ్వ, తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here