లియాండర్‌ పేస్‌తో తలపడ్డ ధోనీ.. విజయం ఎవరిదంటే?!!

0
2


ముంబై : ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ధోనీపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో విండీస్, సౌతాఫ్రికా పర్యటనల నుండి స్వయంగా తప్పుకున్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌: 36 ర్యాంకులు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు రోహిత్‌.. టాప్‌-10లోకి అశ్విన్‌

ధోనీ ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ధోనీ ముంబైలో జరిగిన ఛారిటి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను అలరించాడు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఛారిటి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను రితి స్పోర్ట్స్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం జరిగిన ఓ మ్యాచ్‌లో బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో.. సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌తో ధోనీ తలపడ్డాడు.

ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను రితి స్పోర్ట్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ధోనీ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలోనే ధోనీ రిటైర్మెంట్‌ తీసుకోవడం లేదని సమాచారం తెలుస్తోంది.

విరామ సమయంలో ధోనీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల కొన్న ‘రెడ్‌బీస్ట్‌’ జీప్‌ చెరోకీ ట్రాక్‌హక్‌ ఎస్‌యూవీని ధోనీ తొలిసారి నడిపాడు. ధోనీ రాంచీలో కారు నడుపుతూ అభిమానుల కంట పడ్డాడు. ధోనీ జీపు నడుపుతున్న ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా పర్యటన అనంతరం రాంచీ చేరుకున్న ధోనీని.. విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారితో కలిసి మహీ కారులో వెళ్లాడని సమాచారం తెలుస్తోంది. ధోనీ పక్కనే ఆయన సతీమణి సాక్షి కూడా ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here