లీటర్ పెట్రోల్ రూ.80: సౌదీ దెబ్బకు పెరుగుతున్న ధరలు

0
3


లీటర్ పెట్రోల్ రూ.80: సౌదీ దెబ్బకు పెరుగుతున్న ధరలు

సౌదీ అరేబియాలోని ఆరామ్ కో చమురు క్షేత్రాలపై దాడి అనంతరం అంతర్జాతీయ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్‌పైనా ప్రభావం పడింది. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. శనివారం హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.79.02 కాగా, డీజిల్ ధర రూ.73.29గా ఉంది. అమరావతిలో పెట్రోల్ రూ.8.69 కాగా, డీజిల్ రూ.72.62గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.78.62, డీజిల్ ధర రూ.72.28గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లోను దాదాపు ఇదే పరిస్థితి. ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.74.34 వద్ద స్థిరంగా ఉన్నాయి. డీజిల్ ధర రూ.67.24గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.80 డీజిల్ రూ.70.55గా ఉంది.

శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.74.34 ఉండగా, ముంబైలో రూ.80గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.67.14 వద్ధ స్థిరంగా కనిపించింది. ముంబైలో 11 పైసలు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్‌కు 15 పైసలు పెరిగి రూ.77.03 కాగా, డీజిల్ ధర 10 పైసలు రూ.69.66గా ఉంది. చెన్నైలో పెట్రోల్ 16 పైసలు పెరిగి రూ.77.28, డీజిల్ రూ.11 పైసలు పెరిగి 71.09గా ఉంది.

పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పన్నెండు రోజులుగా పెరుగుతోంది. మంగళవారం నాటికి ఎనిమిది రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.2.20 పెరగగా, డీజిల్ ధర రూ.1.64 పెరిగింది.

సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 24వ తేదీ నాటికి ఈ ఎనిమిది రోజుల్లో ముఖ్య నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా పెరిగాయి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.2.10, ముంబైలో రూ.2.08, కోల్‌కతాలో రూ.2.06, చెన్నైలో రూ.2.21 పెరిగింది. ఇప్పుడు మరింత పెరిగాయి.

ఈ ఏడాది ప్రారంభం నుంచి నాలుగు రోజుల క్రితం వరకుు ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.5.48 పెరిగాయి. డీజిల్ రూ.4.41 పెరిగింది. అలాగే, మరో నాలుగు ముఖ్య నగరాల్లో డీజిల్ ధరలు రూ.1.76 వరకు పెరిగింది.

చమురు దిగుమతిదారుల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియానే వరల్డ్ టాప్. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ మార్కెట్‌కు సౌదీ అరేబియానే పెద్ద దిక్కు అయింది. ఇప్పుడు ఆ దేశ రిఫైనరీలపై జరిగిన దాడులు అటు గ్లోబల్ మార్కెట్‌ను, ఇటు భారతీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే అత్యధికంగా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. 2018-19లో భారత్‌కు 207.3 మిలియన్ టన్నుల చమురు దిగుమతులు చేసుకోగా, సౌదీ వాటా 40.33 మిలియన్ టన్నులు. ఈ క్రమంలో తగ్గిన సౌదీ చమురు ఉత్పత్తి దేశీయ మార్కెట్‌లో పెట్రో ధరలకు మరింతగా ఎక్కువవుతుందని అంచనా.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here