లైబ్రరీలో పుస్తకం చదివితే… రూ 10… మరో గ్రంధాలయ ఉద్యమం…!

0
2


లైబ్రరీలో పుస్తకం చదివితే… రూ 10… మరో గ్రంధాలయ ఉద్యమం…!

పుస్తకాల విలువ ఈనాటి విద్యార్థులకు బాగా తెలుసు, అయితే అవి సబ్జెక్టు సంబంధించిన పుస్తకాలు మాత్రమే,ఇక ఇతర పుస్తకాలు అంటే ఎలా ఉంటాయో తెలియదు. దీంతో సమాజంలో వచ్చే మార్పులు, గత చరిత్ర, భవిష్యత్ పరిమాణాలు ఎలా ఉంటాయో కూడ తెలియదు.ఈ నేపథ్యలంనే జీవితంతో పాటు సమాజంపై సరైన అవగహాన లేక ఎంతమంది తికమక పడుతున్నారు. మరోవైపు వారిలో సామాజిక పరివర్తనలో కూడ మార్పులు గమనించ లేని పరిస్థితి.దీంతో గ్రంధాలయాలు కూడ ఎక్కడికక్కడ మూత పడుతున్నాయి.

ఈనేపథ్యంలోనే వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు ప్రజాగ్రంథాలయం వినూత్న నిర్ణయం తీసుకుంది. యువతీయువకులు, విద్యార్థులు, మహిళలు, వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే..పుస్తకం చదవడం పూర్తి చేస్తే రూ. 10 ప్రోత్సాహక బహుమతిని చెల్లిస్తామంటూ ప్రజాగ్రంథాలయం కమిటీ ప్రకటించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధరణంగా ఎక్కడైన పుస్తకాలు కొనాలన్నా, తీసుకుని చదవాలన్న కొంత మొత్తాన్ని చెల్లించాలని, కాని పుస్తం చదివితే డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో కోంత వైవిధ్యంగా కనిపిస్తోంది.

గ్రంథాయలంలో పుస్తక పఠనం పూర్తయిన తరువాత పుస్తకంలోని సారాంశాన్ని రాసి సెల్ఫీ తీయాలి. ఇలా సెల్ఫీ తీసిన పేజీని ములుకనూరు గ్రంథాలయం వాట్సప్‌లో షేర్‌ చేయాలి..వెంటనే గ్రంథాలయ కమిటీ నగదును అందజేస్తుంది. పుస్తకపఠనం చేసేందుకు ఎలాంటి నిబంధనలు లేవు ,. ఒక రోజులో ఎన్ని పుస్తకాలు అయినా చదువవచ్చు అని గ్రంథాలయ కమిటీ ప్రకటించింది. కాగా అవకాశాన్ని శుక్రవారం నుంచి ఈ ఆఫర్‌ అమలులోకి తీసుకువచ్చింది. మరి ఎంతమంది పుస్తకాలు చదవడంపై ఆసక్తి చూపుతారో వేచి చూడాలి.

మరోవైపు ఈ విషయం సోషల్ మీడీయాలో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here