లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం

0
3


లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం

అదాలత్‌లో న్యాయమూర్తి సత్తయ్య

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 800 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి కిరణ్మయి అన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. మోటారు వాహన బీమా కేసులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి గోవర్దన్‌రెడ్డి బెంచ్‌ నిర్వహించారు. బ్యాంకు, సివిల్‌ కేసులకు సంబంధించిన బెంచ్‌ను న్యాయసేవా సంస్థ కార్యదర్శి కిరణ్మయి, బెంచ్‌ సభ్యులుగా రాజ్‌కుమార్‌ సుబేదార్‌ చేపట్టారు. మొదటి అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టును న్యాయమూర్తి కళార్చన, బెంచ్‌ సభ్యులు ఆశనారాయణ, రెండో అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టును న్యాయమూర్తి ఉమామహేశ్వరి, బెంచ్‌ సభ్యులుగా అంకిత, ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి పెద్ది చందన, బెంచ్‌ సభ్యులుగా కృష్ణగోపాల్‌రావు క్రిమినల్‌ కేసులకు సంబంధించిన కేసులను పరిశీలించారు. బోధన్‌లో అదనపు జిల్లాజడ్జి సూర్యచంద్రకళ, కామారెడ్డిలో అదనపు జిల్లా జడ్జి సత్తయ్య ఆధ్వర్యంలో బెంచ్‌ కొనసాగింది. జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో బీమా కేసుల్లో కక్షిదారులకు కోటి రూపాయల పరిహారం అందినట్లు కార్యదర్శి కిరణ్మయి పేర్కొన్నారు.

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా జిల్లాలో 119 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ మేరకు కామారెడ్డిలో శనివారం లోక్‌అదాలత్‌ నిర్వహించారు. మోటార్‌ వాహనాల కేసులకు సంబంధించి బీమా సంస్థల నుంచి 11 కేసుల్లో రూ.34.99 లక్షలను బాధితులకు ఇప్పించారు. ఆబ్కారీ శాఖకు సంబంధించిన 58 కేసుల్లో రూ.2.90 లక్షల రుసుమును చెల్లించేలా తీర్పు చెప్పారు. అదాలత్‌లో 47 క్రిమినల్‌ కేసులు, 3 సివిల్‌ దావాలు, ఓ గృహ హింస కేసుకు పరిష్కారం లభించింది. జిల్లా అడిషనల్‌, సెషన్స్‌ జడ్జి సత్తయ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, మొబైల్‌ మేజిస్ట్రేట్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here