లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర పరిష్కారం

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌ అదాలత్‌ ద్వారా న్యాయ సంబంధిత సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, సీనియర్‌ న్యాయవాది రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ అన్నారు. వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం ”న్యాయ సేవల దినోత్సవం” పురస్కరించుకొని నిజామాబాదు నగరంలోని సిఎస్‌ఐ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి రాజ్‌ కుమార్‌ సుభేదర్‌ వక్తగా హాజరై మాట్లాడారు. న్యాయ సేవల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, మహిళలు లోక్‌ అదాలత్‌ల ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. న్యాయ స్థానాలు లోక్‌ అదాలత్‌లు ప్రజలకు న్యాయ సేవలు మరింత వేగంగా, సులభంగా ఖర్చు లేకుండా అందిస్తున్నాయన్నారు. విద్యార్థులు విద్యా సంబందిత విషయాలపై దష్టి పెట్టాలని ఇతర విషయాల జోలికి పోకుండా కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని ఉద్బోదించారు. అనంతరం విద్యార్థులతో చర్చ గోష్ఠి నిర్వహించి విద్యార్ధులడిగిన ప్రశ్నలకు సుబేదార్‌ సమాధానమిచ్చారు. కార్యక్రమంలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, సలహాదారులు చింతల గంగాదాసు, సిఎస్‌ఐ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రమేష్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here