వంతెన పూర్తి.. ప్రయాణం సాఫీ

0
4


వంతెన పూర్తి.. ప్రయాణం సాఫీ

– న్యూస్‌టుడే, బీబీపేట

నిర్మాణం పూర్తయిన వంతెన

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రం నుంచి రాజన్న సిరిసిల్లా జిల్లాకు వెళ్లేందుకు ఎగువ మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన ఎట్టకేలకు పూర్తయింది. 2015లో అప్పటి మంత్రి కేటీఆర్‌ బీబీపేటలో ఈ-పంచాయతీని ప్రారంభించారు. తన నియోజకవర్గం నుంచి బీబీపేటకు ప్రయాణం ఇబ్బందిగా ఉందని గుర్తించి ఈ వంతెన నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 2016లో పంచాయతీరాజ్‌ నిధులు రూ. 10 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ 19 భారీ పిల్లర్లతో సుమారు 315 మీటర్లు ఉంటుంది. 2019లో పనులు పూర్తయ్యాయి. బీబీపేట మండల కేంద్రం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా శివారు గ్రామం శ్రీగాధకు వెళ్లాంటే గతంలో 18 కి.మీ.ల దూరం ప్రయాణించాల్సి వచ్చేంది. ఈ బ్రిడ్జి పూర్తికావడంతో రెండు గ్రామాల మధ్య దూరం కేవలం 6 కి.మీ.లు మాత్రమే. ఒక్కసారి 12 కి.మీ.ల దూరం తగ్గడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీగాధ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే కామారెడ్డి జిల్లా కేంద్రం మీదుగా 150 కి.మీ.ల దూరం అవుతుంది. ఈ వంతెనపై నుంచి వెళ్తే 100 కి.మీ.లు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. బీబీపేట నుంచి శ్రీగాధకు బీటీ రోడ్డు గతంలోనే వేశారు. వంతెనపై బీటీ రోడ్డు వేయాల్సి ఉంది. పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి రూ. 50 లక్షలు విడుదల చేశారని, త్వరలో రోడ్డు పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here