వచ్చిన కొద్ది రోజులకే డీఈఈ బదిలీ

0
0


వచ్చిన కొద్ది రోజులకే డీఈఈ బదిలీ

నిజామాబాద్‌  నగరం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ నగరపాలక సంస్థ డీఈఈగా వచ్చిన సాయిలక్ష్మిని డిప్యుటేషన్‌పై మిర్యాలగూడ పురపాలక సంఘానికి బదిలీ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న ఆమె ఈ మధ్యే పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు తీసుకున్న తరువాత సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆమెను ఇక్కడ పని చేయకుండా కొందరు  ఒత్తిడి  చేయడంతోనే  వెళ్లిపోయారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో డిప్యుటేషన్‌పై ఇతర జిల్లాకు పంపించడం చర్చనీయాంశంగా  మారింది.  ఇది వరకు    ఇన్‌ఛార్జి డీఈఈగా ఉన్న ముస్తాక్‌ యథావిధిగా కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here