వచ్చే 4ఏళ్లలో హైదరాబాద్‌లో 5 లక్షల ఉద్యోగాలు, ఏపీలో ఐటీ ఎగుమతులు అంతంతే

0
0


వచ్చే 4ఏళ్లలో హైదరాబాద్‌లో 5 లక్షల ఉద్యోగాలు, ఏపీలో ఐటీ ఎగుమతులు అంతంతే

హైదరాబాద్: రానున్న మూడు నాలుగేళ్లలో హైదరాబాద్ ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాలు రెండింతలు అయి, 10 లక్షలకు పెరుగుతాయని హైదరాబాద్ సాఫ్టువేర్ ఇంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (Hysea) వెల్లడించింది. నగరంలో ఐటీ సెక్టార్ వేగంగా విస్తరిస్తోందని, అంతేకాకుండా కృత్రిమ మేథ (AI-Artificial intelligence), డేటా సైన్స్, బ్లాక్ చైన్ వంటి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, స్టార్టప్‌లు విస్తరిస్తున్నాయని చెప్పారు.

హైదరాబాదులో డబుల్ కానున్న ఉద్యోగాలు

హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలో ప్రస్తుతం 5.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని Hysea పేర్కొంది. రాబోవు మూడు నాలుగేళ్లలో 50 మిలియనన్ చదరపు అడుగుల ఐటీ ఆఫీసు స్థలం గచ్చిబౌలి, హైటెక్ సిటీ సహా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ వర్క్ ఫోర్స్ పది లక్షలకు చేరుతుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది 17 శాతం వృద్ధితో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులు నమోదయ్యాయి.

అయిదేళ్ళుగా వృద్ధి ఇలా..

అయిదేళ్ళుగా వృద్ధి ఇలా..

2013-14లో హైదరాబాద్ నుంచి 57,258 కోట్ల ఐటీ ఎగుమతులు, 3.23 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2014-15లో 66,276 కోట్ల ఐటీ ఎగుమతులు, 3.71 లక్షల మంది ఉద్యోగులు, 2015-16లో 75,070 కోట్ల ఐటీ ఎగుమతులు, 4.07 లక్షల మంది ఉద్యోగులు, 2016-17లో 85,470 కోట్ల ఐటీ ఎగుమతులు, 4.31 లక్షల మంది ఉద్యోగులు, 2017-18లో 93,442 కోట్ల ఐటీ ఎగుమతులు, 4.75 లక్షల మంది ఉద్యోగులు, 2018-19లో 1,09,219 కోట్ల ఐటీ ఎగుమతులు, 5.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు డేటా వెల్లడించింది.

ఏపీ నుంచి నామమాత్రపు ఎగుమతులు

ఏపీ నుంచి నామమాత్రపు ఎగుమతులు

తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ఆశించిన స్థాయిలో ఐటీ ఎగుమతులు నమోదు కావటం లేదని చెప్పారు. అదే సమయంలో ఏపీ నుంచి ఎగుమతులు నామమాత్రంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.1,000 కోట్ల సాఫ్టువేర్ ఎగుమతులు ఏపీ నుంచి నమోదయ్యాయి. ప్రధానంగా విశాఖపట్టణం, విజయవాడలోని ఐటీ కంపెనీలు ఎగుమతులు చేస్తున్నాయి.

వేతనాలు ఆకర్షణీయం

వేతనాలు ఆకర్షణీయం

జావా, డాట్ నెట్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు వివిధ ఐటీ కంపెనీలు వివిధ రకాలుగా వేతనాలు చెల్లిస్తోందని హైసియా వెల్లడించింది. నైపుణ్యం ఆధారంగా కంపెనీలు బేసిక్ శాలరీని రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు కూడా ఇస్తున్నాయని చెప్పారు. ఫ్యూచరిస్టిక్ డిజిటల్ స్కిల్స్ ఉంటే రూ.6 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఇస్తున్నారని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here