వద్దన్నా.. ఇచ్చేశారు

0
0


వద్దన్నా.. ఇచ్చేశారు

తెవివి వీసీ ఆదేశాలు బేఖాతరు

● నలుగురు సిబ్బందికి వేతనాలు విడుదల

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి)

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌ ఆదేశాల కంటే విద్యార్థి నాయకుల పైరవీకే రిజిస్ట్రార్‌ బలరాములు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వీసీకి తెలియకుండానే పొరుగు సేవల కింద 24 మందికి ఉద్యోగాలు, పని చేస్తున్న 13 మంది సిబ్బందికి రిజిస్ట్రార్‌ పదోన్నతులు ఇచ్చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన విద్యార్థి నాయకులు పైరవీతో వచ్చినవారే ఎక్కువ. పొరుగు సేవల కింద కొత్త ఉద్యోగాలు, పదోన్నతుల వ్యవహారంలో రిజిస్ట్రార్‌ అత్యుత్సాహాన్ని ఉపకులపతి తప్పుపట్టారు. ఒకవైపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై కమిటీ అధ్యయనం చేస్తుంటే కొత్తగా ఉద్యోగాలు, పదోన్నతులు ఎందుకిచ్చారని ఆగ్రహించారు. కొత్తగా చేరుకున్న వారిని వెంటనే విధుల్లోంచి తొలగించి, పదోన్నతులు ఇచ్చిన వారిని పాత స్థానాల్లో ఉంచాలని సెప్టెంబరు 25న వీసీ స్పష్టం చేశారు. పొరుగు సేవల కింద కొత్తగా చేర్చుకున్న ఉద్యోగుల్ని తొలగించాలని వీసీ ఆదేశించారు. కానీ విద్యార్థి నాయకుల ప్రోద్బలంతో సారంగాపూర్‌ క్యాంపస్‌లో ఇద్దరు జూనియర్‌ అసిసెంట్లు, భిక్కనూర్‌ దక్షిణ ప్రాంగణంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కొనసాగుతూ వచ్చారు. వీరికి సంబంధించి అక్టోబరు నెల వేతనాల హాజరు అకౌంట్‌ సెక్షన్‌కు వచ్చినట్లు వీసీ దృష్టికి వచ్చింది. కొత్త వారెవరికీ వేతనాలు ఇవ్వొద్దని ఏవో ఖాదర్‌ మోహినొద్దిన్‌కు వీసీ అనిల్‌కుమార్‌ రిజిస్ట్రార్‌ బలరాములు సమక్షంలోనే ఈ నెల ఈ నెల 1న స్పష్టం చెశారు. ప్రధాన క్యాంపస్‌లో అన్ని వ్యవహారాల్లో తలదూర్చే ఇద్దరు విద్యార్థి నాయకులు, భిక్కనూర్‌ క్యాంపస్‌లో గత కొన్నేళ్లుగా తమ హవా సాగించుకుంటున్న మరో విద్యార్థి సంఘం నాయకుడు రిజిస్ట్రార్‌పై ఒత్తిడి పెంచి కొత్తగా చేరిన నలుగురు పొరుగు సేవల సిబ్బందికి వేతనాలివ్వాలని పట్టుబట్టారు. వారి ఒత్తిడికి తలొగ్గిన రిజిస్ట్రార్‌ సంబంధిత సిబ్బందికి జీతాలు ఇవ్వాలని ఏవోకు సూచించడంతో వేతనాలు జమ చేసినట్లు తెలిసింది. వీసీ ఆదేశాలు పక్కన పెట్టి ఆ నలుగురికి ఏ ప్రాతిపదికన వేతనాలు వేశారంటూ ఇటీవల తొలగింపునకు గురైన మిగతా సిబ్బంది పేర్కొంటున్నారు. వీసీ ఆదేశాలకంటే విద్యార్థి నాయకుల మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని పలువురు పొరుగు సేవల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here