వయవ దానానికి ముందుకు రావాలి

0
0


వయవ దానానికి ముందుకు రావాలి

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ కవితారెడ్డి

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: అవయవ దానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ కవితారెడ్డి కోరారు. మంగళవారం మానిక్‌బండార్‌లోని కాకతీయ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అవయవ దానం చేసేందుకు వయస్సుతో సంబంధం లేకుండా, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ఎవరైనా దానం చేయవచ్చని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినవారు, బ్రెయిన్‌ డెడ్‌ అయినవారి నుంచి అవయవ దానానికి వీలుందని తెలిపారు. ఇక బతికుండి కూడా మూత్రపిండాలు, కాలేయం ఇతర పలు అవయవాలు దానం చేసే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఎంఏ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో ఐఎంఏ కార్యదర్శి సవితారాణి, పిల్లల వైద్యనిపుణుడు నీలి రామ్‌చందర్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here