వయొలెన్స్ కావాలన్నారుగా.. సాలిడ్‌గా ఇస్తా: నాని

0
2


నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మనం ముందుగా ఆశించేది కామెడీ. ఆ తరవాత ఎమోషన్స్. అప్పుడప్పుడు కొన్ని డిష్యుం డిష్యుంలు. మొత్తంగా చూసుకుంటే కుటుంబం మొత్తం రెండున్నర గంటలపాటు హాయిగా వీక్షించే సినిమాలే నాని ఎక్కువగా చేస్తారు. కానీ, ఈసారి మాత్రం ఫుల్ వయొలెన్స్‌తో వస్తున్నారట. అది కూడా ఉగాదికి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

నాని, సుధీర్‌బాబు హీరోలుగా నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘వి’. ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అనేది ట్యాగ్ లైన్‌. నానికి 25వ చిత్రమిది. నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్‌, ల‌క్ష్మణ్‌, హ‌ర్షిత్ నిర్మిస్తున్నారు. మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేస్తున్నారు. ఈ మేరకు నాని సోషల్ మీడియా ద్వారా పోస్టర్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

View this post on Instagram

Violence kavalannaru ga 🙂 Istha… UGADI ki SOLID ga istha …🔥 #VTheMovie ✌🏼

A post shared by Nani (@nameisnani) on

విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘నాని 25వ చిత్రం మా బ్యాన‌ర్‌లో రూపొందుతుండ‌టం ఆనందంగా ఉంది. అలాగే సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు కాంబినేషన్ బాగా కుదిరింది. నాని, సుధీర్‌బాబు పోటాపోటీగా నటించారు. ‘స‌మ్మోహ‌నం’ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత మోహనకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రమిది. 80 శాతం చిత్రీక‌రణ పూర్తయ్యింది. రెండు ఫైట్స్, ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వ‌ర‌కు చూడ‌ని ఓ కొత్త పాత్రలో నాని క‌న‌ప‌డ‌తారు. త‌ప్పకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కు సినిమా న‌చ్చేలా ఉంటుంది. ఉగాది సంద‌ర్భంగా సినిమాను మార్చి 25న విడుద‌ల చేస్తున్నాం’’ అని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here