వరద నీటిలో డ్యాన్సులు.. భయం లేకుండా ఫన్నీగా.. డేంజరే సుమీ (వీడియో)

0
0


వరద నీటిలో డ్యాన్సులు.. భయం లేకుండా ఫన్నీగా.. డేంజరే సుమీ (వీడియో)

కుండపోత వర్షాలతో కర్ణాటక కుదేలవుతోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహంతో చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. కొన్నిచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అదలావుంటే వరదలొస్తే ఎవరైనా, ఎక్కడైనా జనాలు గజగజ వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తారు. అలాంటి సిట్యువేషన్‌కు భిన్నంగా కర్ణాటకలో మరో తీరుగా కనిపించింది. వరద బీభత్సాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా కొందరు యువకులు ఎంజాయ్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కర్ణాటకలోని యమగర్ని గ్రామ వాసులు వరదలను ఎంజాయ్ చేస్తున్నారు. భారీ వర్షాలతో నిప్పని – కొల్హాపూర్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. అయితే యమగర్ని గ్రామానికి చెందిన కొంతమంది ఆ వరద నీటిలో సరదాగా డ్యాన్స్ చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా వరద నీటిలో పాటలు పెట్టుకుని వాటికి అనుగుణంగా డ్యాన్స్ చేశారు. ఆ సన్నివేశం కాస్తా వీడియో రూపంలో బయటకొచ్చి నెట్టింట్లో సందడి చేస్తోంది. వరదలు వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా భయపడతారు. కానీ వీళ్లేమో చిందులేస్తూ సరాదాగా గడుపుతున్న తీరు నవ్వు తెప్పిస్తోంది. అయితే ఆ సరదా వెనుక ప్రమాదం పొంచి ఉందనే విషయం మరిచిపోవద్దనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అదలావుంటే భారత వాతావరణ శాఖ ఇప్పటికే కర్ణాటకలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఇటీవల భారీ వర్షాల కారణంగా బీహార్‌లో వరదలొచ్చాయి. అయితే అద్లావ్‌ పూర్‌ ప్రాంతానికి చెందిన అఫ్జల్‌ తన స్నేహితులతో కలిసి వరద నీటిలో టిక్‌టాక్‌ వీడియో చేశాడు. మొదట ఓ బాలుడు డైవ్‌ చేయగా అనంతరం అఫ్జల్‌ కూడా దూకాడు. కొంతదూరం ఈదుకుంటూ వెళ్లిన తర్వాత వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అఫ్జల్‌ కొట్టుకుపోయాడు. దాంతో అలర్టైన ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అదలావుంటే మూడు రోజుల తర్వాత అఫ్జల్ డెడ్‌బాడీ బయటపడింది. ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగుచూస్తున్నా యువతలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రాణాలతో చెలగాటమాడుతూ లైఫ్‌ను రిస్క్‌లో పడేసుకుంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here