వరస్ట్ జూలై సేల్స్: భారీగా పడిపోయిన వాహన విక్రయాలు, కారణాలివే…

0
0


వరస్ట్ జూలై సేల్స్: భారీగా పడిపోయిన వాహన విక్రయాలు, కారణాలివే…

న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా వాహనరంగం ఏమాత్రం అనుకూలంగా లేదు. తాజాగా, జూలై నెలలో పలు కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు క్షీణించాయి. అన్ని కంపెనీల క్షీణత రెండంకెల్లోనే ఉన్నాయి. కొన్ని కంపెనీల విక్రయాలు దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. కార్ల విక్రయాల తగ్గుదల అన్ని కంపెనీల సరాసరి చూస్తే 30 శాతం వరకు ఉంది. బైక్ విక్రయాల క్షీణత 15 శాతంగా ఉంది. మారుతీ సుజుకీ విక్రయాల క్షీణత 36.3 శాతంగా ఉంది. రెండేళ్లలో మొదటిసారి లక్ష యూనిట్ల లోపు మంత్లీ వ్యాల్యుమ్ రిపోర్ట్ చేసింది. 2017 జూన్ తర్వాత లక్ష కంటే దిగువకు పడిపోయింది.

రెండు దేశాబ్దాల్లో దిగువకు…

పలు అగ్రశ్రేణి వాహన కంపెనీల విక్రయాలు (మంత్రీ వైజ్) రెండు దశాబ్దాల దిగువకు పడిపోవడం గమనార్హం. గత ఏడాది జూలైలో కంటే ఈ ఏడాది విక్రయాలు బాగా పడిపోయాయి. హ్యుండాయ్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, టయోటా, హోండా కార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్.. ఇలా అన్ని కంపెనీల విక్రయాలు పడిపోయాయి. సుజుకీ మోటార్ సైకిల్ మాత్రం గత ఏడాది కంటే సేల్స్ పెంచుకుంది.

ఏ కార్ల అమ్మకాలు ఎంత పడిపోయాయంటే?

ఏ కార్ల అమ్మకాలు ఎంత పడిపోయాయంటే?

కార్ల అమ్మకాల విషయానికి వస్తే… గత ఏడాది (2018) జూలై నెలలో మారుతీ సుజుకీ విక్రయాలు 1,54,150 ఉండగా, 2019లో జూలైలో 98,210కి పడిపోయాయి. విక్రయాల్లో క్షీణత 36.3 శాతం. మహీంద్రా అండ్ మహీంద్రా 2018లో 44,605 ఉంటే 2019లో 37,474 (క్షీణత 16%), హ్యుండాయ్ మోటార్ 2018లో 43,481 ఉంటే 2019లో 39,010 (క్షీణత 10%), టయోటా కిర్లోస్కర్ మోటార్ 2018లో 13,677 ఉంటే 2019లో 10,423 ((క్షీణత 24%), హోండా కార్ప్ ఇండియా 2018లో 19,970 ఉంటే 2019లో 10,250 (క్షీణత 48.67%), అశోక్ లేలాండ్ 2018లో 14,205 ఉంటే 2019లో 10,101కి (క్షీణత 29%) పడిపోయాయి.

బైక్స్ అమ్మకాలు ఎంత పడిపోయాయంటే.. సుజుకీ రివర్స్

బైక్స్ అమ్మకాలు ఎంత పడిపోయాయంటే.. సుజుకీ రివర్స్

బైక్‌ల అమ్మకాల విషయానికి వస్తే… గత ఏడాది (2018) జూలై నెలలో బజాజ్ ఆటో విక్రయాలు 2,37,511 అయితే 2019 జూలైలో 2,05,470 (క్షీణత 13%), టీవీఎస్ మోటార్ 2,47,382 అయితే 2019లో 2,08,489కు (క్షీణత 15.72%) పడిపోయాయి. సుజుకీ మోటార్ సైకిల్ సేల్స్ మాత్రం 17 శాతం పెరిగాయి. 2018లో ఈ కంపెనీ సేల్స్ 53,321 కాగా, 2019 జూలైలో 62,366.

ఆటో సేల్స్ పడిపోవడానికి కొన్ని కారణాలు...

ఆటో సేల్స్ పడిపోవడానికి కొన్ని కారణాలు…

గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు సేల్స్ అంతంత మాత్రమేనని ఆటో పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం మరింత పెరుగడం, పన్నులు కూడా అధికమవడం, నిధుల లభ్యత అంతంత మాత్రంగానే ఉండటం, వినియోగదారుల సెంటిమెంట్ తగ్గడం వంటి పలు కారణాలు ఆటోమొబైల్ రంగంపై ఎనలేని ప్రభావం చూపుతోందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here